/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/konasema-jpg.webp)
Pleasant Atmosphere : మార్చి నెల రాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు(Temperatures) క్రమంగా పెరుగుతు వస్తున్నాయి. ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకు చేరుకుంటుంది. దీంతో ప్రజలు కాస్త ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయితే, గోదావరి జిల్లా(Godavari District) లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ఉదయం 8 గంటలకు కూడా మంచు కురుస్తూ ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది.
Also Read : జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఉండాలా..? సుప్రీంకోర్టులో పిటిషన్
పచ్చని పకృతి అందాలకు పెట్టింది పేరు తూర్పుగోదావరి జిల్లా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి(Sankranti) వెళ్ళినప్పటినుండి రోజు రోజుకు మంచు పెరిగిపోతోంది. పచ్చని పంట పొలాలు, కోనసీమ కొబ్బరి చెట్లు మధ్య ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తోంది. మంచు అందాలతో కోనసీమ కొత్త అందాలను సంతరించుకుంటుంది. కొబ్బరి చెట్లపై స్నోఫాల్(Snow Fall) చూపరులను కట్టిపడేస్తుంది. ఉదయం 8గంటలు అవుతున్న మంచు తగ్గకపోవడంతో ప్రకృతి ప్రేమికులు(Nature Lovers) మంచు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు.
కవి కూడా వర్ణించలేని అద్భుతమైన ప్రకృతి సహజ సిద్ధమైన అందాలు కోనసీమ సొంతం అంటూ మురిసిపోతున్నారు కోనసీమ వాసులు. ఈరోజు ఉదయం అంబెడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట లో.. కాకినాడ జిల్లాలో కనిపించిన మంచు అందాలు RTV కెమేరాకు చిక్కాయి. కోనసీమ ఒక్కసారిగా కేరళ, ఊటీ, కోడైకెనల్, లంబసింగి అందాలు కోనసీమలో కనిపించాయి. కోనసీమ అంటేనే ప్రకృతి అందాల రామణియతకు పెట్టిన పేరు అలాంటి కోనసీమకు మంచు అందాలు తోడైతే ఇక వర్ణించలేని విధంగా ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుందని చెప్పవచ్చు.
Also Read : పుట్టపర్తి వైసీపీలో రౌడీ రాజకీయాలు.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వర్సెస్ లోచర్ల విజయభాస్కర్ రెడ్డి..!