టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన విమానం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..!!

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. కాలిఫోర్నియా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పార్కులో విమానం కూలిపోయింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

New Update
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన విమానం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..!!

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన విమాన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కాగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. దక్షిణ కాలిఫోర్నియాలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ చిన్న విమానంలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానంలో ఓ పార్కులో కూలిపోయింది. పార్కులో ఒక్కసారిగా కూలడంతో అక్కడున్న జనాలంతా భయబ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు పెట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీం, సహాయక చర్యలు ప్రారంభించాయి.

PLANE CRASH

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, సింగిల్ ఇంజిన్ సెస్నా-172 విమానం మంగళవారం మధ్యాహ్నం 2:45 గంటలకు మురియెటాలోని ఫ్రెంచ్ వ్యాలీ విమానాశ్రయం నుండి బయలుదేరింది. విమానంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయింది. న్యూస్ ఛానల్స్‌లో ప్రసారమైన ఫుటేజీలో, చిన్న విమానం పార్క్ లో కూలిపోయినట్లు కనిపించింది.

రివర్‌సైడ్ కౌంటీ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, లాస్ ఏంజిల్స్‌కు ఆగ్నేయంగా 135 కి.మీ దూరంలో ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురిని ఆసుపత్రుల్లో చేర్పించారు, వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ ఘటనపై విచారణ చేపట్టాయి. ఇంతకు ముందు కూడా అమెరికాలో అనేక చిన్న విమాన ప్రమాదాలు జరిగాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు