కూలిన విమానం..పైలట్‌తో సహా ముగ్గురు దుర్మరణం..!! దక్షిణ కాలిఫోర్నియాలో ఆదివారం విమాన ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియా విమానాశ్రయంలోని హ్యాంగర్ ను విమానం ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. హ్యాంగర్‌ను ఢీకొట్టడంతో విమానం మంటల్లో చిక్కుకుంది. విమానంలో ఒక పైలట్, ఇద్దరు ప్రయాణికులు మరణించారని అధికారులు వెల్లడించారు. By Bhoomi 31 Jul 2023 in ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఆదివారం విమాన ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియా విమానాశ్రయంలోని హ్యాంగర్ ని ఒకే ఇంజన్ విమానం ఢీకొట్టడంతో విమానం మంటల్లో చిక్కుకుంది. విమానంలో మంటలు చెలరేగడంతో ఒక పైలట్, ఇద్దరు ప్రయాణికులు మరణించారని అధికారులు తెలిపారు. ఇది చిన్న విమానమని, అందులో ముగ్గురు వ్యక్తులు మరణించారని చెప్పారు. బీచ్‌క్రాఫ్ట్ పీ35లో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. ఉదయం 6.30 గంటలకు అప్‌ల్యాండ్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో విమానం కూలిపోయిందని చెప్పారు. శాన్ బెర్నార్డినో కౌంటీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు అప్‌ల్యాండ్ పోలీసులు తెలిపారు. డౌన్‌టౌన్ లాస్ ఏంజెల్స్‌కు తూర్పున 40 మైళ్ల (65 కిలోమీటర్లు) దూరంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనలో హ్యాంగర్ కూడా పాడైందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఎఫ్‌ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో అమెరికాలో తరచుగా విమానా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతకు ముందు జూలై 8న దక్షిణ కాలిఫోర్నియాలో మైదానంలో విమానం కూలిన ఘటన ఆరుగురు మరణించారు. విమానం మంటల్లో చిక్కుకుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. లాస్ ఏంజెల్స్ దక్షిణంగా ఉన్న 85 మైళ్ల దూరంలో ఉన్న నైరుతి రివర్‌సైడ్ కౌంటీలోని కాలిఫోర్నియాలోని ముర్రియేటా నగరంలోని విమానాశ్రయానికి సమీపంలో విమానం కూలిపోయింది. తెల్లవారుజామున 4.15 గంటలకు అధికారులు విమానాన్ని గుర్తించారు. అందులో ఆరుగురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. జూలై 29న జరిగిన విమాన ప్రమాదంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ జనరల్ మరణించారు. మేజర్ జనరల్ ఆంథోనీ పాట్స్, 59, పైపర్ PA-28 చెరోకీ విమానం మేరీల్యాండ్‌లోని హవ్రే డి గ్రేస్‌లో క్రాష్ అయ్యింది. వాషింగ్టన్, DCకి 75 మైళ్ల కంటే తక్కువ దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పాట్స్ సంఘటనా స్థలంలో మరణించినట్లు తెలిపారు. #us-plane-crash మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి