తనకు మెరిట్ ఉన్నా కూడా కంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని పీజేఆర్ (PJR) కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సర్వే రిపోర్టుల్లోనూ తానే ముందు ఉన్నానన్నారు. అన్ని పార్టీల నుంచి తనకు ఆఫర్లు వస్తున్నాయన్నారు. కార్యకర్తలతో మాట్లాడి పోటీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెంగ్మెంట్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉందన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ పొందిన అజారుద్దీన్ దావూద్ ఇబ్రహీం తమ్ముడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వస్తే.. HCA లో చేసిన స్కామ్ ఇక్కడ కూడా జరుగుతుందన్నారు. టికెట్ ఇవ్వని విషయంపై కాంగ్రెస్ పెద్దల నుంచి తనకు ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. పార్టీ మారే అంశంపై రేపు నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. తండ్రి వారసుడు కొడుకే అవుతారని ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, తన సోదరి విజయా రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి
PVR Interview: అజారుద్దీన్ దావూద్ ఇబ్రహీం తమ్ముడు.. విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
సర్వే రిపోర్టుల్లో ముందు ఉన్నా కూడా తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేపు కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
New Update
Advertisment