Pithapuram Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై వన్నెపూడి గ్రామంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడిపై వర్మ క్లారిటీ ఇచ్చారు. తనపై దాడికి పవన్ కళ్యాణ్ కు గానీ, జనసేనకు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తులే జనసేనలో చేరి దాడి చేశారన్నారు. జరిగిన దాడి ఎంపీ తంగేళ్ల ఉదయ్ మనుషుల పనేనని అన్నారు.
Also read: వీడెవడ్రా బాబు ఇంత విచిత్రంగా ఉన్నాడు.. వీడియో వైరల్..!
పొత్తుకు ముందు కూడా వారు ఇలానే దాడులు చేశారని వర్మ ఆరోపించారు. తాను ఎవరి మీదా కేసులు పెట్టనని.. పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటానని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై జనసేన నాయకుల నుండి ఎలాంటి సమాచారం లేదన్నారు.
దాడి గురించి తానూ జనసేన వాళ్లకు చెప్పలేదని వర్మ వెల్లడించారు.
Also Read: అమరావతిలో సందడి.. వేగంగా సాగుతోన్న పనులు!
కాగా, టీడీపీ నేత వర్మ.. ఎన్నికలకు సపోర్ట్ చేసిన వారిని కలిసేందుకు వెళ్లగా ఈ దాడి జరిగింది. టీడీపీ నుంచి సస్పెండై జనసేనలోకి వెళ్లిన నేతలు, కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వర్మ కారుపై రాళ్లు, బాటిళ్లతో దాడి చేశారు. అడ్డుకున్న వర్మ అనుచరుల కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో స్వల్ప గాయాలతో వర్మ, అతని అనుచరులు బయటపడ్డారు.