Pithapuram Polling: పిఠాపురంలో రికార్డ్ బద్దలు.. ఓటర్ల సునామీ. గెలిచేదెవరో మరి!

ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టినీ ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయి ఓటింగ్ జరిగింది. అర్ధరాత్రి వరకూ ప్రజలు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తమ్మీద 84.27 శాతం ఓటింగ్‌ ఇక్కడ నమోదైంది. 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 81.24గా ఉంది. 

Pithapuram Polling: పిఠాపురంలో రికార్డ్ బద్దలు.. ఓటర్ల సునామీ. గెలిచేదెవరో మరి!
New Update

Pithapuram Poling: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఓట్లు వేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. చాలా చోట్ల అర్థరాత్రి దాటేవరకూ క్యూ లైన్లలో నిలబడి ప్రజలు ఓటేశారు. ఏపీ ఎన్నికల్లో కీలకమైన నియోజకవర్గాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పిఠాపురం మున్సిపాలిటీతో పాటు.. కొండెవరం, విరవ, విరవాడ, మల్లం, కందరాడ..గొల్లప్రోలు, చేబ్రోలు, చెందుర్తి, వన్నెపూడి..పోలింగ్ కేంద్రాలలో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ బూతుల ముందు క్యూకట్టిన ప్రజలు అర్థరాత్రి దాటేవరకూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పిఠాపురంలో 84.27 శాతం ఓటింగ్‌ నమోదైంది. 

Also Read: పిఠాపురంలో హైఓల్టేజ్‌ రాజకీయం

గతం కంటే ఎక్కువగా..
Pithapuram Poling: గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో పిఠాపురం ఓటింగ్ శాతం 81.24గా ఉంది. ఈసారి దానిని మించి నమోదవడం విశేషం. ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు, యువత అందులోనూ మొదటిసారి ఓటు వేస్తున్న వారు ఉత్సాహంగా ఓటు వేయడం గమనార్హం. 

ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలం..
Pithapuram Poling: ఇక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పెండ్యం దొరబాబు 14 వేల పైచిలుకు మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్వీఎన్ వర్మ పై గెలిచారు. ఇప్పుడు అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి తరపున బరిలో నిలిచారు. అలాగే వైసీపీ నుంచి వంగా గీత విశ్వనాధ్ పోటీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు అని తెలిసిన దగ్గర నుంచి పిఠాపురం ప్రజల్లో జోష్ కనిపించింది. పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ పోటీని ప్రజలు ఆహ్వానించిన పరిస్థితి కనిపించింది. అదే పరిస్థితి పోలింగ్ వరకూ కంటిన్యూ అయింది. పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమే కానీ, ఎంత మెజార్టీ అనేదే తేలాలి అంటూ చాలామంది చెబుతూ వచ్చారు. ఇక ఓటింగ్ శాతం పెరగడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. వైసీపీ గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేసింది. పవన్ కళ్యాణ్ ని ఓడించాలని ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నాయకులు పిలుపునిచ్చారు. కానీ, స్థానికంగా పరిస్థితి భిన్నంగా ఉన్నట్టు అక్కడి రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఓటింగ్ శాతం పెరగడం తమకే అనుకూలిస్తుంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు పేద సంఖ్యలో ఓటింగ్ కు రావడం తమకు ప్లస్ అవుతుంది అని వారంటున్నారు. గత ఐదేళ్ళలో జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల ఫలితమే మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఓటు వేయడాన్ని కారణమని వారు విశ్లేషిస్తున్నారు. మరోవైపు జనసేన నాయకుల వాదన మరో రకంగా ఉంది. పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలి అనే ఒకే ఒక్క కారణంతో పిఠాపురంలో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారని వారంటున్నారు. ఎప్పుడూ ఓటు వేయనివారు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ఓటు వేశారని చెబుతున్నారు. 

పవన్ గెలుపు లాంఛనమేనా?
Pithapuram Poling: ఎన్నికల ముందు జరిగిన పలు సర్వేలు.. సమీక్షలు.. స్టడీ రిపోర్టులు కూడా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తాయని చెప్పాయి. ఓటింగ్ సరళి కూడా దానికి అద్దం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు పై అనుమానమే లేదనీ.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవడం పక్కా అని జనసేన అభిమానులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఏది ఏమైనా ఎవరి అంచనాలు నిలుస్తాయో.. ఎవరి లెక్కలు కరెక్ట్ అవుతాయో జూన్ 4న తేలుతుంది. అప్పటివరకూ వేచి చూడాల్సిందే. 

#ap-elections-2024 #pithapuram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి