![AP: డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో కొట్టుకున్న అధికారులు..!](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/officers.jpg)
Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురం మున్సిపాలిటీలో ఇద్దరు అధికారులు కొట్టుకున్నారు. పిఠాపురం మున్సిపాలిటీ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కనక రాజు, డీ ఈ భవాని శంకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సాక్షాత్తు మున్సిపల్ సమావేశంలోనే కౌన్సిలర్ల మధ్య అధికారులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు మైక్ తో కొట్టుకుంటూ కాలర్ పట్టుకుని బూతులు తిట్టుకున్న పరిస్థితి ఏర్పడింది.
Also Read: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆగని దారుణాలు.. అమ్మాయిని తప్పించడానికి..!
టీడీపీ కౌన్సిలర్లు.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఏ విధంగా చెల్లించారని ప్రశ్నించారు. DE ఇంజనీరింగ్ బిల్లులు కొన్ని తప్పుగా పెట్టడంపై అతడిని నిలదీశారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఏకంగా ఒకరిని ఒకరు కొట్టుకునేందుకు దారి తీసింది. సాధారణంగా మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు కొట్టుకోవడం అనేది మామూలు విషయం. కానీ అధికారులు కొట్టుకోవడంతో నియోజకవర్గంలో ఈ సంఘటన చర్చినీయాంశంగా మారింది.