Pendem Dorbabu: వైసీపీకి షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. రెండు మూడు నెలలుగా పరిస్థితులు మారాయని... అందుకే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తదుపరి కార్యాచరణపై తన క్యాడర్ తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కాగా ఆయన త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ..జనసేనలో చేరికపై పెండెం దొరబాబు క్లారిటీ ఇవ్వలేదు.
ఎన్నికల ముందు నుంచే..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 కి 175 స్థానాల్లో విజయం సాధించాలని బరిలోకి దిగిన జగన్.. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే తరహాలో పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుకు కాకుండా వంగా గీతకు టికెట్ ఇచ్చారు జగన్. దీంతో అప్పటి నుంచి దొరబాబు పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో తాజాగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Also Read : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం!