Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్‌ రిలీఫ్‌

AP: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బిగ్‌రిలీఫ్‌ దక్కింది. 3 కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ ను హైకోర్టు మంజూరు చేసింది. ఎన్నికల కౌంటింగ్‌ అయ్యే వరకు అరెస్ట్‌ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.

New Update
Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్‌ రిలీఫ్‌

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బిగ్‌రిలీఫ్‌ దక్కింది. మూడు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ ను హైకోర్టు మంజూరు చేసింది. ఎన్నికల కౌంటింగ్‌ అయ్యే వరకు అరెస్ట్‌ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్‌ పై ఉన్నారు పిన్నెల్లి. ఇవి కాక పిన్నెల్లిపై మరో మూడు కేసులు నమోదు అయ్యాయి. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిపై దాడి చేశారని ఒక కేసు, కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి విషయంలో కేసు, పాల్వాయిగేటులో నాగ శిరోమణిపై దాడికి సంబంధించి మరో కేసు మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. ఈ మూడు కేసుల్లో అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. కాగా పోలింగ్ జరిగిన రోజు నుంచి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు..

1.ప్రతిరోజు ఎస్పీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలి.
2.నరసరావుపేట లో ఎక్కడ ఉంటారో పూర్తి అడ్రెస్స్, సెల్ నెంబర్ తో సహా ఎస్పీ ఆఫీసులో ఇవ్వాలి.
3. పాస్ పోర్ట్ కోర్టులో సరెండర్ చేయాలి.

Advertisment
తాజా కథనాలు