Village Women Still Dont Wear Clothes in Pini Village Himachal pradesh: భిన్న సంస్కృతులు, సంప్రదాయాల కలయిక ఇండియా. దేశంలో ఒక ఊరిలో ఉన్న సంప్రదాయం మరో ఊరిలో ఉండదు.. ఓ వర్గం పాటించే సంపద్రాయం మరో వర్గం పాటించదు.. ముఖ్యంగా గ్రామీన ప్రాంతాల్లో కట్టుబట్లు ఎక్కువ. సిటీల్లో నివసించే వాళ్లకి వారి ట్రెడిషన్లు చిత్రవిచిత్రంగా అనిపించక మానదు. కానీ అక్కడి వారికి ఇది సర్వసాధారణం. తరతరాలుగా వస్తున్న నమ్మకాలను నేటి చంద్రయాన్ యూగంలో పాటించే గ్రామాలు ఉన్నాయి. అందులో ఓ వింత ఆచారం గురించి తెలుసుకుందాం.
మహిళలు బట్టలు వేసుకోరు!
లింగ సమానత్వంతో ప్రపంచం ఆధునిక యుగంలోకి దూసుకెళ్తుంటే.. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని అసాధారణ సంప్రదాయాలు మహిళలను ప్రత్యేక పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. దేశంలోని ఒక గ్రామంలో మహిళలు ఐదు రోజులు బట్టలు లేకుండా ఉండాల్సిన సంప్రదాయం గురించి మీకు తెలుసా? ఈ సంప్రదాయాన్ని చాలా కాలంగా ఆచరిస్తున్నారు అక్కడి మహిళలు. ఆ గ్రామంలోని మహిళలందరూ దీనిని అనుసరిస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికరణ్ లోయ పిని విలేజ్‌లో ఈ వింత ఆచారం కనిపిస్తుంది.
ఎందుకిలా చేస్తారు?
ప్రతి సంవత్సరం, సావన్ వర్షాకాలంలో, పిని గ్రామంలోని మహిళలు ఐదు రోజులు బట్టలు వేసుకోరు. ఏ స్త్రీ అయినా ఈ సంప్రదాయాన్ని పాటించకపోతే కొద్ది రోజుల్లోనే ఏదో ఒక చెడు వార్త వింటుందన్నది వారి నమ్మకం. ఈ సమయంలో గ్రామంలోని భార్యాభర్తలు ఒకరికొకరు పూర్తిగా దూరంగా ఉంటారు. కనీసం ఒకరిని చూసి ఒకరు నవ్వకూడదు. స్త్రీలు బట్టల్లో అందంగా కనిపిస్తే... రాక్షసులు వచ్చి ఎత్తుకుపోతారని ప్రజలు నమ్ముతారు. అటు పురుషులకు కూడా నియమాలు ఉన్నాయి. ఈ సమయంలో పురుషులు మద్యం లేదా మాంసం తినకూడదు. ఈ సంప్రదాయాన్ని సరిగా పాటించకపోతే దేవతలకు కోపం వస్తుందని.. దాని కారణంగా ఏదో ఒక కీడు జరుగుతుందని నమ్ముతారు.
ALSO READ: చంద్రయాన్-3 బాడీ పెయింటింగ్ ఫొటోలు వైరల్.. మీరు కూడా ఓ లుక్కేయాల్సిందే!