Pig Kidney To Human: చరిత్రలో తొలిసారి.. బతికి ఉన్న మనిషికి పంది కిడ్నీని అమర్చిన డాక్టర్లు!

ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా వైద్యులు ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. 62 ఏళ్ల రోగికి పంది కిడ్నీని విజయవంతంగా అమర్చడం ద్వారా వైద్య చరిత్రలో పెను విప్లవం సృష్టించారు.ఇది ప్రపంచంలోని లక్షలాది కిడ్నీ రోగుల్లో కొత్త ఆశలను నింపింది.ఇప్పటికే రెండుసార్లు పంది గుండెను మనిషికి అమర్చారు.

New Update
Pig Kidney To Human: చరిత్రలో తొలిసారి.. బతికి ఉన్న మనిషికి పంది కిడ్నీని అమర్చిన డాక్టర్లు!

జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీని సజీవంగా ఉన్న మనిషికి తొలిసారిగా మార్పిడి చేయడంలో వైద్యులు విజయం సాధించారు. ఈ ప్రయోగం కివైద్య రంగంలోని పెద్ద పురోగతులు కొత్త అవకాశాలను తెరిచింంది. మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌లో 4 గంటలపాటు జరిగిన శస్త్రచికిత్సలో వైద్యులు ఈ ఘనత సాధించారు. 1954లో ప్రపంచంలోనే మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఈ ఆసుపత్రిలోనే జరిగింది. ఇక పంది కిడ్నీని 62 ఏళ్ల రిక్ స్లేమాన్‌కు ఇమ్‌ప్లాంట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉందని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చని వైద్యులు తెలిపారు. ఈ కొత్త కిడ్నీ సంవత్సరాల పాటు కొనసాగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే జంతువుల నుంచి మనిషికి అవయావల మార్పిడి విషయంలో ఇంకా పరిశోధనలు జరగాలని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విజయం భవిష్యత్తులో జంతు అవయవాల మార్పిడిపై ఆశలను పెంచుతుందన్నారు. పంది కిడ్నీలను ఇంతకు ముందు ప్రయోగాత్మకంగా బ్రెయిన్-డెడ్ వ్యక్తులకు అమర్చారు, అయితే జీవించి ఉన్న మానవుడిలో అమర్చడం ఇదే తొలిసారి.

publive-image

అప్పుడు మనిషి కిడ్నీ.. ఇప్పుడు పంది కిడ్నీ:
చాలా సంవత్సరాలుగా మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న రిక్ స్లేమాన్‌ 2018లో మానవ కిడ్నీ మార్పిడిని పొందాడు. ఐదు సంవత్సరాల తరువాత, మూత్రపిండాల వైఫల్యం లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. 2023 నుంచి ఆయనకు మళ్లి డయాలసిస్ ప్రారంభమైంది. గతేడాది కిడ్నీ సమస్య చివరి దశకు చేరుకోవడంతో వైద్యులు పంది కిడ్నీ తీసుకోవాలని సూచించారు. ఈ ప్రయోగానికి రిక్ స్లేమాన్‌ ఒకే చెప్పారు.

జీవించి ఉన్న మనిషికి పంది అవయవాన్ని మార్పిడి చేయడం ఇది మూడోసారి. ఇప్పటికే రెండుసార్లు పంది గుండెను మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరు రోగులు వారి అవయవాలను స్వీకరించిన వారాల తర్వాత మరణించారు. అయితే ఇప్పుడు అమెరికా వైద్యుల బృందం ఈ కొత్త అద్భుతం చేసింది. ఇప్పుడు వైద్యులు ఈ రోగిని చాలా సంవత్సరాలు పర్యవేక్షిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే లక్షలాది మంది కిడ్నీ రోగులకు మేలు జరుగుతుంది.

Also Read: ఉదయం ఇవి తింటే గుండె జబ్బులతో పాటు డయాబెటిస్ వస్తాయి!

Advertisment
తాజా కథనాలు