KTR: లక్షన్నర మందిని దివ్యాంగులుగా చేసిన పాపం కాంగ్రెస్ దే: కేటీఆర్ దివ్యాంగుల పింఛన్‌ను పెంచుతామన్నారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం రూ.4,016 పింఛన్ ఇస్తున్నామని.. కేసీఆర్ మళ్లి సీఎం అవ్వగానే రూ.6,016కు పెంచుతామని చెప్పారు. అటు తెలంగాణలో లక్షలమంది దివ్యాంగులగా మారడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. By Trinath 19 Oct 2023 in Latest News In Telugu నల్గొండ New Update షేర్ చేయండి KTR in Physically Challenged Thanksgiving Meeting: సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ మాట్లాడుతోందంటూ హస్తం పార్టీపై (Congress Party) ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్(Minister KTR). నాణ్యమైన నీటిని ఇవ్వకుండా లక్షన్నర మందిని దివ్యాంగులుగా మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారని.. మనం వాళ్ళకి ఇచ్చింది ఒక్క ఛాన్స్ కాదు 11 ఛాన్సులని గుర్తు చేశారు కేటీఆర్. 55 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చామన్నారు. మీ దిక్కుమాలిన పాలన వల్ల నల్లగొండలో (Nalgonda) లక్షల మంది పిల్లలు అంగవైకల్యం బారిన పడ్డారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఏ జిల్లాకు పోయినా ఫ్లోరోసిస్ (Fluorosis) బాధితులు కనబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. కేసీఆర్ ఇంకా ఏం అన్నారంటే: ➡ 11 సార్లు చూసినం అవే పాచిపోయిన ముఖాలు ➡ మీరు ఉన్నప్పుడు కనీసం కరెంట్ సరిగ్గా ఇచ్చారు ➡ మీరు ఉన్నప్పుడు కనీసం తాగునీరైనా ఇచ్చారా ➡ కనీసం పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు ➡ 200 రూపాయల పెన్షన్ కోసం నాలుగు రోజులు తిరగాల్సి ఉండేది. ➡ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించేటోళ్లు మానసిక వైకల్యం ఉన్నవాళ్లు ➡ రాహుల్ గాంధీ వచ్చిండు మాది కుటుంబ పాలన అంటుండు మరి ఆయనది ఏం పాలన? పింఛన్‌ను పెంచుతాం: దివ్యాంగుల పింఛన్‌ను పెంచుతామన్నారు కేటీఆర్. ప్రస్తుతం దివ్యాంగులకు రూ. 4,016 పింఛన్ ఇస్తున్నామని.. కేసీఆర్ (KCR) మళ్లి సీఎం అవ్వగానే రూ.6,016కు పెంచుతామని చెప్పారు. అటు పింఛన్ విషయంలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.4 వేలు పింఛన్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇస్తుందా అని ప్రశ్నించారు. అటు బీజేపీ గుజరాత్‌లో ఇస్తున్న పింఛన్ రూ.600 నుంచి రూ.1000 వరుకేనన్నారు. కేటీఆర్ ఇంకేం అన్నారో తెలుసుకోవాలంటే కింది వీడియోను చూడండి: Also Read: కొండా సురేఖకు యాక్సిడెంట్.. కాళ్లు, చేతులు, మొహానికి గాయాలు #minister-ktr #physically-challenged-thanksgiving-meeting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి