ఓటర్ల జాబితాలో మహిళ స్థానంలో సీఎం జగన్ ఫోటో.! అసలేం అయిందంటే?

ఓటర్ల జాబితాలో తన ఐడీని చూసి ఓ మహిళ అవాక్కైంది. ఆమె స్థానంలో ఏకంగా సీఎం జగన్ ఫొటో రావడం చూసి షాక్ అయింది. ప్రస్తుతం ఈ టాపిక్ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
ఓటర్ల జాబితాలో మహిళ స్థానంలో సీఎం జగన్ ఫోటో.! అసలేం అయిందంటే?

CM Jagan photo in voters list: ఓ మహిళ తన ఓటర్ గుర్తింపు కార్డు కోసం అప్లై చేసింది. అందుకోసం కావలసిన పత్రాలన్నీ వాలంటర్ కు ఇచ్చింది. అయితే, ఓటర్ల జాబితాలో తన ఒటర్ ఐడీను చూసి ఒక్కసారిగా షాక్ అయింది. తన ఫొటోకు బదులు ఏకంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటో రావడం చూసి అవాక్కైంది. వివారాళ్లోకెళ్తే..

Also Read: నీలాంటి కూతుళ్లు శత్రువుకి కూడా పుట్టాలని ఎవరూ కోరుకోరు.!

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం వై . చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఓటర్ల జాబితాలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓటర్ గుర్తింపు కార్డు కోసం అప్లై చేసిన జానపాటి గురువమ్మ కు పెద్ద షాకే తగిలింది. ఓటర్ల జాబితా లిస్ట్ లో తన ఫొటోకు బదులు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటో రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అదేంటి అన్ని కరెక్ట్ గా ఇచ్చా కదా ..ఎలా ఫొటో మారింది అంటూ షాక్ అయింది. ప్రస్తుతం ఈ టాపిక్ ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

RTVతో బాధితురాలు గురువమ్మ మాట్లాడుతూ.. కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే తన స్థానంలో ముఖ్యమంత్రి ఫొటో వచ్చిందని మండిపడింది. ఓటర్ గుర్తింపు కార్డుకు అవసరమైన పత్రాలన్నీ వాలంటర్ కు కరెక్ట్ ఇచ్చానని తెలిపింది.అయితే, తన స్థానంలో ముఖ్యమంత్రి ఫొటో ఎలా వచ్చిందో తనకు తెలియదని పేర్కొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫొటో సరి చేయాలని డిమాండ్ చేసింది.

ఇది ఇలా ఉండగా ఈ వ్యవహారంపై ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం అండతో అధికారులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. అటు గ్రామస్తులు కూడా వైసీపీ నాయకుల అండదండలతోనే అధికారులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు