Pharma Industry: ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు.

ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం కంపెనీలు ఏదైనా మెడిసిన్ రీకాల్ చేస్తే, వారు లైసెన్సింగ్ అథారిటీకి తెలియజేయాలి.

New Update
Pharma Industry: ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు.

Pharma Industry: ఇప్పుడు ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఏదైనా మెడిసిన్  రీకాల్ చేస్తే, వారు లైసెన్సింగ్ అథారిటీకి తెలియజేయాలి. అంతేకాకుండా  తమ ఉత్పత్తుల అన్ని లోపాలు, నాణ్యత లేని లేదా రాంగ్ ప్రోడక్ట్ గురించి కూడా తెలియజేయాలి. అలాగే, డబ్ల్యూహెచ్‌ఓ మరియు ఇతర ప్రపంచ ప్రమాణాల ప్రకారం ఔషధాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

ఫార్మాస్యూటికల్ కంపెనీలకు(Pharma Industry) మంచి తయారీ పద్ధతులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 షెడ్యూల్ M క్రింద సూచించారు. కొత్త నోటిఫికేషన్‌లో, ఈ షెడ్యూల్ M లో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జోడించింది. నిజానికి 2022లో భారత్‌లో తయారైన మందుల వల్ల విదేశాల్లో చాలా మంది చనిపోయారు. ఈ కారణంగా, ఔషధ పరిశ్రమపై పరిశీలనను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. భారతీయ ఔషధ పరిశ్రమ విలువ 50 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలోని 50 బిలియన్ డాలర్ల ఔషధ పరిశ్రమ ప్రతిష్టను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

ఇవీ గైడ్ లైన్స్..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణానికి అనుగుణంగా మందులను పరీక్షించాలని.. చిన్న కంపెనీలను(Pharma Industry) ప్రపంచ ప్రమాణాలకు తీసుకురావాలంటే ఇక్కడ తయారయ్యే మందులను కూడా వాతావరణానికి అనుగుణంగా పరీక్షించాలని కొత్త మార్గదర్శకాల్లో స్పష్టంగా చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన నాణ్యమైన ఔషధాలను కంపెనీలు తయారు చేయాలని కూడా మార్గదర్శకంలో పేర్కొంది. అలాగే, అన్ని పరీక్షలు సంతృప్తికరమైన ఫలితాలను అందించినప్పుడు మాత్రమే తుది ఉత్పత్తిని మార్కెట్‌లో విడుదల చేయాల్సి ఉంటుంది. 

మెడిసిన్స్  నాణ్యతకు ఫార్మా కంపెనీలదే బాధ్యత..
ఈ నోటిఫికేషన్‌లో, తయారీదారు తన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల(Pharma Industry) నాణ్యతకు బాధ్యత వహించాలని ప్రభుత్వం పేర్కొంది.  తద్వారా అవి అవసరమైన వినియోగానికి సరిపోతాయని నిర్ణయించుకోవచ్చు.  వారి ఉత్పత్తి భద్రత లేదా నాణ్యత లేకపోవడం వల్ల రోగి ప్రాణానికి ప్రమాదం కలిగించకుండా చూసుకోవడం తయారీదారుని  బాధ్యత కూడా. పరీక్షలు సంతృప్తికరమైన ఫలితాలను చూపించినప్పుడు..  ఏదైనా బ్యాచ్ పునరావృత పరీక్ష లేదా ధృవీకరణ కోసం తగినంత పరిమాణంలో తుది ఉత్పత్తి నమూనాలను ఉంచినప్పుడు మాత్రమే కంపెనీలు తుది లేదా సిద్ధంగా ఉన్నట్లు లేబుల్ చేయాలని కూడా ఈ గైడ్ లైన్స్ చెబుతున్నాయి . 

Also Read: జీఎస్టీ నిబంధనల్లో మార్పు.. చిన్న వ్యాపారులకు ఇబ్బందే.

ఫార్మాస్యూటికల్ కంపెనీలు(Pharma Industry) తమ తుది ఉత్పత్తికి సంబంధించిన శాంపిల్స్‌ను రిపీట్ టెస్టింగ్ కోసం తగినంత పరిమాణంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. 

చాలా కంపెనీలు ఫెయిల్..
డిసెంబర్ 2022 నుంచి 162 ఫార్మా కంపెనీల్లో (Pharma Industry) జరిగిన తనిఖీల్లో ముడిసరుకు పరీక్షలు జరగడం లేదని తేలిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగస్టులో వెల్లడించింది. భారతదేశంలోని 8,500 చిన్న ఔషధ కర్మాగారాల్లో నాలుగింట ఒక వంతు కంటే తక్కువ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన అంతర్జాతీయ ఔషధాల తయారీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. పెద్ద ఫార్మా కంపెనీలు ఈ ఆందోళనలపై ఆరు నెలల్లోగా స్పందించాల్సి ఉంటుందని, చిన్న ఫార్మా కంపెనీలు ఈ ఆందోళనలపై ఏడాదిలోగా స్పందించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది ప్రభుత్వం. ఈ గడువును పొడిగించాలని చిన్న కంపెనీలు డిమాండ్ చేశాయి. ఈ ప్రమాణాలకు తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని, ఇప్పటికే నష్టాల్లో ఉన్నందున సగానికి పైగా కంపెనీలు మూతపడతాయని ఈ కంపెనీలు చెబుతున్నాయి. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు