మీ జీతం నుంచి కట్ అయిన పీఎఫ్ జమ కాలేదా? అయితే ఇలా చేయండి

సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ కట్ అవుతూ ఉంటుంది. అయితే ఇటీవల కొన్ని కంపెనీలు ఉద్యోగుల కంట్రిబ్యూషన్ పీఎఫ్ ఖాతాల్లో జమ చేయడంలేదు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా?

How to check EPF Balance : పీఎఫ్‌ ఖాతాలో బ్యాలెన్స్‌ తెలియడం లేదా..?ఈ సింపుల్ టిప్స్ తో క్షణాల్లో తెలుసుకోవచ్చు..!!
New Update

షాక్ అవుతున్న ఉద్యోగులు.. 

ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం కట్ చేసి పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఇటీవల కొన్ని కంపెనీలు ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలకు జమచేయడం లేదు. సాధారణంగా రెండు రకాలుగా ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ కట్ చేస్తూ ఉంటారు. కొన్ని కంపెనీలు ఉద్యోగి జీతం నుంచి కొంత మాత్రమే కట్ చేస్తుంటే.. మరికొన్ని కంపెనీలు వారు జమచేయాల్సిన కంట్రిబ్యూషన్ కూడా ఉద్యోగి జీతం నుంచే కట్ చేస్తున్నాయి. సరే ఇలా అయినా పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తున్నారా అంటే అది లేదు. దీంతో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్న ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఫిర్యాదు ఎలా చేయాలంటే?

ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో కంట్రిబ్యూషన్ జమ కాకపోతే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చు. దాని కోసం కొన్ని ప్రూవ్ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఈపీఎఫ్ ఖాతాలోకి జమకావడం లేదన్న నిర్ధారణ కోసం పీఎఫ్ ఖాతా స్టేట్ మెంట్ ఒకటి, మీ శాలరీ నుంచి పీఎఫ్ కంట్రిబ్యూషన్ కట్ అవుతున్నట్లు శాలరీ పే స్లిప్ రెండూ సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఈపీఎఫ్ఐజీఎంఎస్(EPFIGMS)పోర్టల్‌లోకి వెళ్లి కంప్లైంట్ చేయాలి. అయితే ఇలా చేయాలంటే తప్పనిసరిగా మీరు యూనివర్స్ అకౌంట్(UAN)నెంబర్ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. మీ ఫిర్యాదును అధికారులు పరిశీలిస్తారు. మీరు సమర్పించిన వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే మీ పీఎఫ్ ఖాతాలోకి రావాల్సిన మొత్తం నగదును వడ్డీ తో సహా కంపెనీ నుంచి వసూలు చేస్తారు. అలాగే జరిమానా కూడా విధిస్తారు. అంతేకాకుండా ఆ కంపెనీపై కొన్ని చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.

15రోజుల్లో చెల్లించాలి.. 

వాస్తవంగా ప్రతి నెలా ఉద్యోగి బేసిక్ జీతంలో 12శాతం పీఎఫ్ ఖాతాకు తన వంతుగా చెల్లించాలి. అలాగే కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేయాలి. జీతం చెల్లించిన 15 రోజుల్లోపే యాజమాన్యం ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ చెల్లించాలి. ఇలా జమ అయిందో లేదో తెలుసుకోవాలంటే EPF పోర్టల్‌లో లాగిన్ అయ్యి యాజమాన్యం మీ ఖాతాకు నెలవారీ కంట్రిబ్యూషన్ పంపిస్తున్నారో లేదో చెక్ చేసుకోవచ్చు. అలాగే పీఎఫ్ జమచేసిన ప్రతిసారీ మీ నెంబర్‌కు మెసేజ్ కూడా వస్తుంది. ఒకవళ జమ చేయకపోతే వెంటనే EPF అధికారులకు పైన పేర్కొన్న విధంగా ఫిర్యాదుచేయవచ్చు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe