Petrol,diesel : గ్యాస్ బండ గుదిబండగా మారిన సమయంలో అనూహ్యంగా ఒక్కసారిగా సెంట్రల్ గవర్నమెంట్ సిలిండర్ ధర పై ఏకంగా 200 రూపాయలు రాయితీ ఇచ్చింది. ఇక ఉజ్వల్ స్కీం కింద అయితే ఏకంగా 400 రూపాయల రాయితీ ఇచ్చింది మోడీ సర్కార్. అయితే కేంద్రంలో బీజేపీ సర్కార్ పగ్గాలు పట్టినప్పట్నుంచి పెరుగుతూనే పోయిన గ్యాస్ సిలిండర్ ధర ఇంత భారీ మొత్తంలో ఒకేసారి తగ్గడం రికార్డ్ ను క్రియేట్ చేసింది. మరో వైపు జనం మాత్రం ఇది కలయా.. నిజమా అన్నట్టుగా ఆలోచనలో పడ్డారు.
పెట్రోల్,డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని...!
అయితే గ్యాస్ ధరలు భారీగా తగ్గడంతో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయన్న వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. కేంద్రం పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలను కూడా 5 రూపాలయ వరకు తగ్గిస్తుందన్న వార్త బాగా ఊపందుకుంది. దీంతో వాహనదారుల్లో ఆశలు మొదలయ్యాయి. అయితే ఈ వార్త వెనుక కారణం కూడా ఉంది. 2023 జూన్ నెలలోనే ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటనను వెల్లడించాయి. ఇంధన ధరలను తగ్గించడానికి ఛాన్స్ ఉందని ప్రకటించాయి. దీంతో గ్యాస్ ధరలను తగ్గించడంతో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను మోడీ సర్కార్ తగ్గిస్తుందన్న వార్త చక్కర్లు కొడుతుంది.
అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు స్థిరంగా ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే అంశాన్ని చమురు కంపెనీలు పరిశీలించవచ్చని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నెల రోజుల క్రితమే వెల్లడించారు. చమురు కంపెనీల పనితీరు ఎలా ఉందో కూడా ధరల తగ్గుదల ఆధారపడి ఉంటుందన్నారు.
వచ్చే త్రైమాసికంలో ఈ కంపెనీలు మెరుగ్గా రాణిస్తే, ధరల తగ్గింపుపై వారు నిర్ణయం తీసుకోగలుగుతారన్నారు. అయితే గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేనని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.