వీర్య కణాలు తగ్గిపోవడానికి ఆ మందులే కారణం.. వెల్లడించిన వైద్యులు

పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి బలమైన కారణం పెస్టిసైడ్స్ అంటున్నారు వైద్యులు. ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పర్‌స్పెక్టివ్స్‌ జర్నల్‌ తాజా అధ్యయనం ప్రకారం గడిచిన 50 ఏళ్లలో ఒక మిల్లీలీటర్‌ వీర్యంలో ఉండే కణాల సంఖ్య 50% తగ్గిపోయిందని తెలిపారు.

వీర్య కణాలు తగ్గిపోవడానికి ఆ మందులే కారణం.. వెల్లడించిన వైద్యులు
New Update

ప్రస్తుతం సంతానం కోరుకునే జంటల్లో 90 శాతం మంది సహజంగానే బిడ్డకు జన్మనిస్తున్నారు. కానీ మిగిలిన పది శాతం జంటలకు వైద్య సహాయం తప్పనిసరి అవసరం అవుతుంది. అయితే సంతానం ఆలస్యం కావడానికి పురుషులకు సంబంధించిన 30 శాతం కారణాలున్నాయంటున్నారు వైద్యులు. గాలి కాలుష్యం, పాస్టిక్స్‌, పొగ తాగటం, మద్యం అలవాటు, పోషకాలు లేని జంక్‌ ఫుడ్‌ వంటి వాటితోపాటు ఆహారంలో పురుగు మందులు వాడటం అతిపెద్ద సమస్యగా మారిందని తాజా అధ్యయనంలో వెల్లడించారు. పెస్టిసైడ్స్ కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల బారిన పడటంతోపాటు ఆరోగ్యంమీద తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు.

ఈ మేరకు ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పర్‌స్పెక్టివ్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం.. గత 50 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఒక మిల్లీలీటర్‌ వీర్యంలో ఉండే కణాల సంఖ్య 50% తగ్గిపోయిందని పరిశోధకులు మెలిస్సా పెర్రీ వెల్లడించారు. పంటలు, పార్కులు, ఆహార పదార్థాల మీద చల్లే ఆర్గానో ఫాస్ఫేట్స్‌, ఎన్‌-మిథైల్‌ కార్బమేట్స్‌ వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఆమె తెలిపారు. ఈ పురుగు మందులు సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసేవారు ఈ పురుగు మందుల ప్రభావానికి ఎక్కువగా గురవుతారని డాక్టర్‌ అలెగ్జాండర్‌ పాస్టుస్‌జాక్‌ కూడా వెల్లడించారు.

Also read :Andhra Pradesh: విశాఖ ఫిషింగ్‌ హర్బర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 40కి పైగా బోట్లు దగ్ధం..

అయితే మూడు దశాబ్దాల క్రితం భారతీయ పురుషుల్లో, ఒక మి.లీ వీర్యంలో వీర్యకణాల సంఖ్య 60 మిలియన్లు ఉండేది. ప్రస్తుతం అది 20 మిలియన్లకు పడిపోయింది. వీర్య కణాల సంఖ్య ఇలా తగ్గడానికి అనారోగ్యకరమైన జీవనశైలి ప్రధాన కారణం అని చెప్పారు. పట్టణాల్లో జీవిస్తున్న అధిక శాతం మందిలో వీర్య కణాల ఉత్పత్తిలో సమస్యలు తలెత్తుతున్నాయని, దీనికి కారణం పొల్యూషన్ అని తెలిపారు. వీర్య కణాలు బలంగా లేకపోవడం వల్ల అండాన్ని చేరుకునే ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ పోల్యూషన్ తోపాటు పురుగు మందులు, జంక్ ఫుడ్ వల్ల లైంగిక పటుత్వం కొల్పోతున్నట్లు కనుగొన్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోందని పలు పరిశోధనలు వెల్లడించినట్లు గుర్తు చేశారు. శారీరక శ్రమ లేకపోవడం, ఆహార లోపాలు, మద్యం, పొగ, నిద్రలేమి, మానసిక ఒత్తిడి లాంటివి దీనికి కారణాలుగా పేర్కొన్నారు.

ఇక వీర్యపుష్టి కోసం గుడ్లు, పాలకూర, అరటిపండ్లు, గుమ్మడి పలుకులు, జింక్ పదార్థాలు, దానిమ్మ, టమోటాలు, క్యారెట్, బీట్ రూట్, దుంపలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

#decrease #sperm-cells #pesticides
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి