ప్రస్తుతం సంతానం కోరుకునే జంటల్లో 90 శాతం మంది సహజంగానే బిడ్డకు జన్మనిస్తున్నారు. కానీ మిగిలిన పది శాతం జంటలకు వైద్య సహాయం తప్పనిసరి అవసరం అవుతుంది. అయితే సంతానం ఆలస్యం కావడానికి పురుషులకు సంబంధించిన 30 శాతం కారణాలున్నాయంటున్నారు వైద్యులు. గాలి కాలుష్యం, పాస్టిక్స్, పొగ తాగటం, మద్యం అలవాటు, పోషకాలు లేని జంక్ ఫుడ్ వంటి వాటితోపాటు ఆహారంలో పురుగు మందులు వాడటం అతిపెద్ద సమస్యగా మారిందని తాజా అధ్యయనంలో వెల్లడించారు. పెస్టిసైడ్స్ కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల బారిన పడటంతోపాటు ఆరోగ్యంమీద తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..వీర్య కణాలు తగ్గిపోవడానికి ఆ మందులే కారణం.. వెల్లడించిన వైద్యులు
పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి బలమైన కారణం పెస్టిసైడ్స్ అంటున్నారు వైద్యులు. ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ జర్నల్ తాజా అధ్యయనం ప్రకారం గడిచిన 50 ఏళ్లలో ఒక మిల్లీలీటర్ వీర్యంలో ఉండే కణాల సంఖ్య 50% తగ్గిపోయిందని తెలిపారు.

Translate this News: