Peru Accident: ఘోర బస్సు ప్రమాదం.. 26 మంది మృతి

అమెరికాలోని పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందారు. 14 మందికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

New Update
Peru Accident: ఘోర బస్సు ప్రమాదం.. 26 మంది మృతి

Peru Accident: సౌత్ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరూలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది చనిపోగా.. మరో 14 మంది గాయపడ్డారు. అక్కడి స్థానిక సమయం ప్రకారం ఉదయం పూట ఈ ప్రమాదం జరిగినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. 40 మందికి పైగా ప్రయాణికులతో బస్సు రాజధాని లిమా నుంచి ఆండియన్‌ ప్రాంతానికి బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు 200 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది.

బస్సు లోయలో పడింది అనే సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. తొలుత గాయపడ్డ ఇద్దరు బస్సు డ్రైవర్లను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘాట్ రోడ్లు, వేగంగా వెళ్లడం, రోడ్లు దయనీయంగా ఉండడం, ట్రాఫిక్‌ సిగ్నల్స్ లేకపోవడం తదితర కారణాల వల్ల పెరూలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆ దేశంలో 3,100 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Advertisment
తాజా కథనాలు