ఏపీలో "చెప్పు" రాజకీయం

New Update

జనసేన, వైసీపీ మధ్య వార్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని తిట్టడం.. ఆ వెంటనే వైసీపీలోని కాపు నేతలు మీడియా ముందుకొచ్చి మాటకు మాట బదులివ్వడం కామన్. తాజాగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారాహి యాత్ర చేపట్టిన పవన్.. కత్తిపూడిలో తొలి ప్రసంగం చేశారు. కత్తుల్లాంటి డైలాగులతో వైసీపీ సర్కార్ ను కార్నర్ చేశారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ, బీసీ, కాపులకు తీరని అన్యాయం చేసిందని తిట్టిపోశారు. యథావిధిగా పవన్ కామెంట్స్ కు కౌంటర్స్ ఇచ్చేందుకు వైసీపీలోని కాపు నాయకులు రంగంలోకి దిగారు. ముందుగా మాజీ మంత్రి పేర్ని నాని ఎంట్రీ ఇచ్చారు. పవన్ కామెంట్స్ పై మండిపడుతూ.. తన రెండు చెప్పులను చూపిస్తూ హెచ్చరించారు.

Pawan Kalyan launches tirade against YSRCP leaders, raises slipper to warn them

పేర్ని నాని చెప్పులతో వార్న్ చేస్తుంటే.. గతంలో పవన్ చేసిన కామెంట్స్ గుర్తు రాకుండా ఉండవు. కొన్నాళ్ల క్రితం జనసేన పార్టీ కార్యక్రమంలో పవన్ ప్రసంగిస్తూ చెప్పు చూపించి వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి కౌంటర్ గా పేర్ని నాని తాజాగా రెండు చెప్పులు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను నమ్ముకుంటే మాత్రమే అసెంబ్లీలోకి వెళతారని, చంద్రబాబును నమ్ముకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరని హితవు పలికారు.

చంద్రబాబు పచ్చగా ఉండాలన్నదే పవన్ వ్యూహమని.. పాలించేవాళ్ళ చొక్కా పట్టుకుంటా అన్నాడు కదా.. మోడీ, చంద్రబాబుల చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నారని అడిగారు పేర్ని. పదేళ్లుగా జనసేనని నడుపుతోంది చంద్రబాబేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఆఫీస్ స్థలం ఎవరిదో తెలియదా? ఎవరిచ్చారో తెలియదా? పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ కలిపి దోపిడీ పాలన అందించాయని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ప్రజల కంటే తాను ఎక్కిన లారీ మీద ఎక్కువ దృష్టి పెట్టారని.. అమ్మవారు పేరు పెట్టి రాజకీయాలకు వాడుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో ఆయన ప్రసంగాలు వింటే నేనేనా అని పవన్ కళ్యాణే ఆశ్చర్యపోతున్నారని.. ఇంకా ప్రజలకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అంటూ సెటైర్లు వేశారు.

ఇక సినిమాల అంశంపై ప్రస్తావించిన నాని.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పవన్ తీసిన సినిమాలు రెండు మాత్రమేనని, సినిమా బాగుంటే తప్పకుండా ఆడతాయని చెప్పారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి ఎన్ని వ్యూహాలైనా పన్నుతానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. విమర్శలు చేశారు పేర్ని. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషిస్తానన్న పవన్ వ్యాఖ్యలను ఎద్దేవ చేశారు. గోదానం, భూదానం తరహాలో ముఖ్యమంత్రి పదవి కూడా దానం చేస్తారా అని ప్రశ్నించారు. "ఏదీ తనకు తానుగా నీ దరికి రాదు.. శోధించి సాధించాలి" అన్న శ్రీశ్రీ కొటేషన్ ను ప్రస్తావిస్తూ జగన్ శోధించి సీఎం పదవిని సాధిస్తే, పవన్ మాత్రం అడుక్కుంటున్నారని విమర్శించారు పేర్ని నాని. మొత్తానికి అప్పుడు పవన్ చెప్పు వీడియోలు వైరల్ కాగా.. ఇప్పుడు పేర్ని నాని చెప్పుల వీడియోలు సైతం హైలైట్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు