/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/perni-nani.jpg)
Perni Nani: ఎన్నికల అనంతరం వైసీపీ శ్రేణులపై టీడీపీ, జనసేన శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన పార్టీల రౌడీ మూకలు తమ ఇంటిపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. తమ కార్యకర్తలని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. అందుకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని పేర్నినాని ఆరోపించారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదని.. న్యాయపరంగా పోరాటం చేస్తామని అన్నారు.