Perni Nani: జగన్‌కు అంగుళం కూడా ఏం కాదు: పేర్ని నాని టీడీపీలో వైసీపీ వారిని చేర్చుకోవటం ద్వారా జగన్‌కు రాజకీయంగా అంగుళం కూడా ఏం కాదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చంద్రబాబు అంటున్నారని.. 2014 నుంచి 2019 వరకు ఎంత మందిని రాజీనామా చేయించారో చెప్పాలని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 29 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Perni Nani: టీడీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకు ఎంత మందిని రాజీనామా చేయించారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బెజవాడలో కార్పొరేటర్లు, మేయర్లు రాజీనామా చేయకుండా ఎలా పార్టీ కండువా కప్పుకున్నారని ప్రశ్నించారు. టీడీపీలో వైసీపీ వారిని చేర్చుకోవటం ద్వారా మాజీ సీఎం జగన్‌కు రాజకీయంగా అంగుళం కూడా ఏం కాదన్నారు పేర్ని నాని. Also Read: ఏపీలో దారుణం.. పోలీసులే నగ్నంగా వీడియో తీసి.. నటికి 45 రోజులు నరకం! ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు ఎవరో ఒకరి సపోర్ట్ ద్వారానే గెలుస్తున్నారు తప్పా.. ఒంటరిగా ఎప్పుడూ గెలవలేదని ఎద్దేవా చేశారు. మా పార్టీ అధినేత జగన్‌కు ఇలా పార్టీ మారే నేతలు అవసరం లేదన్నారు. జగన్‌కు జనం ఉంటే చాలన్నారు. జగన్ ఎవరికైతే పదవులు ఇచ్చారో అలాంటి వాళ్ళని మాత్రమే చంద్రబాబు తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారన్నారు. టీడీపీపై 2029లో ప్రజల తిరుగుబాటు ఉంటుందని జోస్యం చెప్పారు. #perni-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి