Periods pain: పీరియడ్స్ పెయిన్ వేధిస్తుందా? ఈ చిన్న చిట్కా మీ నొప్పిని దూరం చేస్తుంది! పీరియడ్స్ పెయిన్ కొన్నిసార్లు భరించలేనిదిగా ఉంటుంది. అయితే కొన్ని టిప్స్‌తో పీరియడ్స్ నొప్పి నుంచి రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. హీట్ థెరపీ, ఆహార మార్పులు, హెర్బల్ టీ, వ్యాయామంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. పీరియడ్స్ పెయిన్ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం. By Trinath 07 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి పీరియడ్స్ పెయిన్ ప్రతి మహిళా ఫేస్ చేసే సమస్య. ఇది ప్రతి నెలా బాధించే నొప్పిని కలిగిస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ స్టార్ట్ అయిన తొలి రోజు చాలా మంది మహిళలు నొప్పిని భరించలేరు. ఇది చాలా అసౌకర్యానికి గురిచేస్తుంది. రుతుక్రమ నొప్పిని డిస్మెనోరియా అని పిలుస్తారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలను ఇక్కడ చూడండి. ప్రతీకాత్మక చిత్రం ➼ హీట్ థెరపీ: మీ పొత్తికడుపుకు హీటింగ్ ప్యాడ్‌ని పెట్టండి.. లేదా వేడి నీటి బాటిల్‌ను పొత్తికడుపుపై పెట్టండి. ➼ మెడిసన్: ఇబుప్రోఫెన్ లాంటి నాన్-ప్రిస్క్రిప్షన్ నొప్పి మందులు అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ➼ హైడ్రేషన్: హైడ్రేటెడ్‌గా ఉండేందుకు పుష్కలంగా నీరు తాగాలి. రోజుకు ఎంత నీరు తాగితే అంత మంచిది. ➼ వ్యాయామం: తేలికపాటి శారీరక శ్రమ కొన్నిసార్లు నొప్పిని తగ్గిస్తుంది. ➼ హెర్బల్ టీ: కొందరు వ్యక్తులు చమోమిలే లేదా అల్లం లాంటి హెర్బల్ టీతో ఉపశమనం పొందుతారు. ➼ బ్రీత్: డీప్ బ్రీత్ తీసుకోండి, శ్వాస లేదా ధ్యానం లాంటి పద్ధతులు పాటించండి.. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడవచ్చు. ➼ ఆహార మార్పులు: పీరియడ్స్ టైమ్‌లో కెఫీన్‌కి కాస్త దూరంగా ఉండండి. డైటరీ ఫైబర్‌ని పెంచండి. ➼ మీ నొప్పి తీవ్రంగా కొనసాగితే ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం. ఫుడ్ అన్నిటికంటే ఇంపార్టెంట్: పీరియడ్స్ పెయిన్ నుంచి ఉపశమనం పొందేందుకు అన్నిటికంటే తినే ఫుడ్ ముఖ్యం. కొన్ని ఆహారాలు చాలా అసౌకర్యానికి కలిగిస్తాయి. ఉప్పు, కెఫిన్, ఆల్కహాల్, చక్కెర తీసుకోవడం తగ్గించండి. ఆవిసె గింజ లాంటి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలు పీరియడ్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, కాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. రక్తస్రావం ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించండి. DISCLAIMER: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీనిని ధృవీకరించలేదు. గమనించగలరు..! ALSO READ: ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి బాసూ.. లేకపోతే మీ బతుకు బస్టాండే..! CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL #periods-pain మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి