పెళ్లికాని వాళ్లకు పింఛన్..నెలరోజుల్లో నిర్ణయం తీసుకోనున్న సర్కార్..!!

పెళ్లిచేసుకోని వారికి పింఛన్ ఇవ్వాలన్న నిర్ణయం హర్యాన ప్రభుత్వం చేస్తోంది. నెలరోజుల్లో ఈ పింఛన్ కు సంబంధించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 45 ఏళ్ల నుంచి 60ఏళ్ల వయస్సున్న అవివాహితులైన స్త్రీ, పురుషులకు ఈ పెన్షన్ అందించే అవకాశం ఉంది.

New Update
Pension : మహిళా ఉద్యోగులకు గుడ్‌ న్యూస్.. పెన్షన్‌లో కొడుకు లేదా కూతురు పేరు నామినేట్

వికలాంగులకు, వింతంతువులకు, వృద్ధులకు ప్రభుత్వాలు పింఛన్లు అందించడం సాధారణ విషయమే. నిరుద్యోగ భృతి డిమాండ్లను కూడా ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. కానీ పెళ్లికానీవారికి కూడా పించన్ ఇవ్వాలన్న డిమాండ్ ఇప్పటివరకూ ఎక్కడా వినలేదు. పెళ్లికాని వారు ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచడమే ఆలస్యం ప్రభుత్వం అందుకు సముఖత వ్యక్తం చేస్తూ పెళ్లికాని వారందరికీ పింఛన్ ఇవ్వాలన్న ఆలోచనలు చేయడం విడ్డూరంగా అనిపిస్తోంది.

unmarried people pension

హర్యాన సర్కార్ ఈ అసాధారణ నిర్ణయంపై సమాలోచనలు చేస్తోంది. నెలరోజుల్లో పెళ్లికాని వారికి పింఛన్ ఇచ్చే విషయంపై క్లారిటీ వస్తుందని వెల్లడించింది. ఈ స్కీం అమలు చేస్తే...పెళ్లికాని వారందరూ ప్రయోజనం పొందుతారు. 45ఏళ్ల నుంచి 60ఏళ్ల వయస్సుగల అవివాహితులు ఈ పథకానికి అర్హులని భావిస్తున్నారు.

ఈ స్కీం కింద పురుషులతోపాటు స్త్రీలకు కూడా పింఛన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయాలను హర్యానీ సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ స్వయంగా వెల్లడించారు. ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఆయన 60ఏళ్ల అవివాహిత తనకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆర్జి పెట్టుకుందని దీనికి సమాధానం ఇస్తూ సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

ఈ పథకం లబ్దిదారులు హర్యానా వాసి అయి ఉండాలి. అవివాహితులై ఉండాలి. ఏడాదికి రూ. 1.80లక్షలకు మించి ఆదాయం ఉండకూడదు. అయితే ఈ స్కీం అమల్లోకి వచ్చినట్లయితే 1.25 లక్షల మందికి పించన్ అందుతుందని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం వృద్ధాప్య పించన్, వికలాంగులకు పించన్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు