AP: టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్‌.. కొనసాగుతున్న పోలీసుల వేట..!

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్‌ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. పీఏలు శశి, తుకారం, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, అనుచరుడు బాబ్‌జాన్‌ ఇంట్లో తనిఖీలు చేశారు. నిన్న ఒక్కరోజే ఐదుగురి ఇంట్లో సోదాలు చేసి కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.

New Update
AP: టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్‌.. కొనసాగుతున్న పోలీసుల వేట..!

Peddireddy Ramachandra Reddy Land Grabbing Issue : మదనపల్లె (Madanapalle) సబ్‌ కలెక్టర్‌ ఆఫీసు భూ రికార్డుల దహనం కేసులో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) బ్యాచ్‌ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. పీఏలు శశి, తుకారం, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, అనుచరుడు బాబ్‌జాన్‌ ఇంట్లో తనిఖీలు చేశారు. నిన్న ఒక్కరోజే ఐదుగురి ఇంట్లో ఏకకాలంలోనే సోదాలు చేశారు.

పీఏ శశిను విచారించేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్‌ (Hyderabad) వచ్చారు. నిన్న రాత్రి నుంచి అయ్యప్ప సొసైటీలోని శశికాంత్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. శశి ఇంట్లో కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రమేష్‌ ఆధ్వర్యంలో శశి ఇంట్లో సోదాలు కొనసాగాయి. ఏపీ (Andhra Pradesh) కి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో శశికాంత్‌ నివాసం ఉంటున్నారు. శశికాంత్‌ ఇంట్లో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేను పిలిచి ఏపీ పోలీసులు తనిఖీలు చేశారు. దాదాపు 8 గంటలపాటు సోదాలు నిర్వహించారు. శశికాంత్ ఇంట్లో భారీగా దస్త్రాలు గుర్తించిన పోలీసులు.. నాలుగు బాక్సుల్లో కీలక దస్త్రాలను తీసుకెళ్లారు.

Also Read : మదనపల్లిలో అర్థరాత్రి కాల్పుల కలకలం!

మదనపల్లె దస్త్రాల దహనం ఘటనపై ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. తంబళ్లపల్లెలోని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. పెద్దిరెడ్డి అధికారిక పీఏ తుకారం ఇప్పటికే విదేశాలకు పారర్‌ అయినట్లు తెలుస్తోంది. తిరుపతిలోని ఆయన నివాసంలో కూడా పోలీసులు సోదాలు చేసి 12 రికార్డులు సీజ్‌ చేశారు. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం పెద్దరెడ్డి అనుచురుడు బాబ్‌జాన్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Advertisment
తాజా కథనాలు