Peddireddy: తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం దురదృష్టకరం: మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు జనసేన లోకి వెళ్తున్నారని తెలియడంతో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి. డిస్క్వాలిఫికేషన్ కు అవకాశం ఉంటే అదికూడా పరిశీలిస్తామన్నారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం దురదృష్టకరమని విమర్శలు గుప్పించారు.

Ex Minister Peddireddy: పెద్దిరెడ్డికి దెబ్బ మీద దెబ్బ.. ఇంటి గేటు బద్దలు కొడతామంటున్న జనసేన!
New Update

Peddireddy Ramachandra Reddy: చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులును పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాజాగా, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఫిరాయింపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆయన జనసేన లోకి వెళ్తున్నారని తెలియడంతో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. డిస్క్వాలిఫికేషన్ కు అవకాశం ఉంటే అది కూడా పరిశీలిస్తామన్నారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం దురదృష్టకరమని విమర్శలు గుప్పించారు.

Also Read: పదవ తరగతి హాల్‌ టికెట్లు నేటి నుంచి విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఇదిలా ఉండగా ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్న సీఎం జగన్.. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్ కేటాయించారు. ఈ క్రమంలోనే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేశారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో కొందరు నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి పార్టీలు మారుతున్నారు. మరోవైపు జగన్ ను ఏపీలో గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీలోని నాయకులను తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నుంచి టికెట్ రాని నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు.

Also Read: లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు

ఇటివల వైసీపీ అధిష్టానం తిరుపతి అభ్యర్థిని మారుస్తూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు కాకుండా తిరుపతి సెగ్మెంట్ కు ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డిని సీఎం జగన్ నియమించారు. తనకు టికెట్ రాలేదని అసంతృప్తిగా ఉన్న శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేనలో చేరాలని భావించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. త్వరలో జనసేనలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్ వైసీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

#peddireddy-ramachandra-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe