Crime: పెద్దపల్లి జిల్లా 6ఏళ్ల బాలిక అత్యాచార ఘటనపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘోరాన్ని సుమోటోగా స్వీకరించిన కమిషన్.. నిందితులపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులు కూలీగా పని చేస్తున్న ఓ మహిళ తన ఆరేళ్ల కూతురితో పాటు అక్కడే నిద్రిస్తుండగా అదే రైస్ మిల్లులో పని చేసే మధ్యప్రదేశ్ కు చెందిన బలరాం అనే యువకుడు పాపని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గొంతునులిమి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నుంచి ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఫోక్సో చట్టంతో పాటు కేసు విచారణ త్వరగా చేసి చార్జి షీట్ దాఖలు చేయాలని చెప్పారు.
Peddapalli: పెద్దపల్లి ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్.. కలెక్టర్ కు ఆదేశాలు!
పెద్దపల్లి జాల్లా కాట్నపల్లిలో 6ఏళ్ల బాలిక అత్యాచార ఘటనపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఘోరాన్ని సుమోటోగా స్వీకరించి, నిందితుడు మధ్యప్రదేశ్ కు చెందిన బలరాంపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.
New Update
Advertisment