Peddapalli MP Joined Congress : బీఆర్‌ఎస్(BRS) పార్టీకి మరో షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్(Peddapalli MP Venkatesh) కాంగ్రెస్(Congress) లో చేరినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను కలిసిన వెంకటేశ్.. సీఎం రేవంత్(CM Revanth) తో పాటు కేసీ ఇంటికి వెళ్లారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీచేసిన వెంకటేశ్ 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళ్లనున్నారని అర్థమవుతోంది. ఎందుకంటే వేణుగోపాల్ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పారు.
వెంకటేష్ నేత బోర్లకుంట తెలంగాణ(Telangana) పెద్దపల్లె లోక్‌సభ నియోజకవర్గం నుంచి 17వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యుడు . ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అభ్యర్థిగా గెలిచారు . ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివారు. ఎన్నికలకు ముందు ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన CPS వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న CPSTEATS నాయకుడు కూడా.
Also Read : ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెరుగుతాయా.. లేదా? తేలేది ఆరోజే!