Pedda reddy Ramachandra Reddy: చంద్రబాబు నువు జైళ్లోనే..!

టీడీపీ నేతలపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబుని ఒక్క రోజు జైలులో పెడితేనే టీడీపీ నేతలు విలవిలలాడుతున్నారని ఆయన వ్యాఖ్యనించారు. చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారని అన్నారు.

New Update
Peddi Reddy: వైఎస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Pedda reddy Ramachandra Reddy: చంద్రబాబు(chandrababu)దుర్మార్గపు వ్యవస్థ కూలిపోతోందని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి(Pedda Reddy Ramachandra Reddy) అన్నారు. పతనం అంటే ఏంటో చంద్రబాబుకు తెలుస్తోందని చెప్పారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భగవంతుడు చేసిన పాపాలు పండెలా చూస్తారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనేక స్కాం లు జరిగాయని..జరిగిన అన్నింటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపారు.ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ పై కూడా విచారణ జరుగుతుందని.. అక్రమాలు చేసిన వారికి చంద్రబాబు తరహాలోనే శిక్షలు తప్పవని హెచ్చరించారు.

చంద్రబాబు కి భయం అంటే ఎంటి, పతనం అంటే ఎంటి అనేది సిఎం జగన్ చూపించారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రక్రియ ప్రారంభమైందని.. ఎక్కువ కేసులు ఉంటే పదవులు అన్న లోకేష్ వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ అని పెద్దిరెడ్డి వ్యాఖ్యనించారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఎలాంటి నిరసన రాలేదని ఆయన అన్నారు. చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు ఉన్నాయని తెలిపారు. పక్కా ఆధారాలతో సీఐడీ దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేశారు.


చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఎలాంటి నిరసన రాలేదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. టీడీపీ బంద్‌ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌ కూడా నడుస్తోందని వెల్లడించారు. స్కిల్‌స్కాం కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పారు.  చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని.. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఎదురుకోవాలని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎవరైన సంతోషించారంటే అది నందమూరి తారక రామారావు ఆత్మ మాత్రమేనన్నారు. టీడీపీ అధినేత  అరెస్ట్ విషయంలో సొంత కుమారుడు లోకేష్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పడిన తపన కనిపించలేదని అన్నారు.

16 నెలలు జగన్ మోహన్ రెడ్డిని జైలులో పెట్టారని..ఒక్క రోజు చంద్రబాబు జైలులో ఉంటే విలవిలలాడుతున్నారని టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. టీడీపీ ఆందోళనతో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరైనా ఆందోళనలు, సంబరాలు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read:  రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఒంటరిగానే చంద్రబాబు.. కలవని కుటుంబసభ్యులు!

Advertisment
తాజా కథనాలు