చలికాలంలో వేడివేడిగా బఠానీ మసాలా గ్రేవీ కూర తయారు చేసేద్దామా!

చపాతీలు తింటే వెయిట్‌ తగ్గొచ్చు.. అయితే చపాతీలో బఠానీ మసాలా గ్రేవీని కలిపి తింటే యమ టెస్టీగా ఉంటుంది. ఈ బఠానీ మసాలా గ్రేవీని ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.

New Update
చలికాలంలో వేడివేడిగా బఠానీ మసాలా గ్రేవీ కూర తయారు చేసేద్దామా!

అసలే చలికాలం..రోజురోజుకి చలి పులి విజృంభిస్తుంది. ఈ సమయంలో వేడివేడిగా తినడంతో పాటు రుచికరంగా కూడా తినాలనిపిస్తోంది. ఈ కాలంలో బయట ఫుడ్స్‌ తినడం అంత మంచిది కాదు. వైరస్ లు పెరిగే సమయం కావడంతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో బరువు కూడా కొంచెం పెరుగుతామని నిపుణులు చెబుతున్నారు.

అలాంటి సమయంలో ఇంట్లోనే ఉంటూ బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండాలనకుంటున్నారా..అయితే ఇంట్లోనే చపాతీలకు సూపర్ కాంబోగా బఠానీ మసాలా గ్రేవీ కర్రీని తయారు చేసుకుందామా!దీనిని తయారు చేయడం చాలా సులభం. అంతే కాకుండా పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఎంతో ఇష్టంగా దీనిని తింటారు.

దీనికి కావాల్సిన పదార్థాలు

పచ్చి బఠాణీలు- 1 కప్పు,
నూనె - 2 టేబుల్ స్పూన్లు,
గరం మసాలా- తగినంత
ఉల్లిపాయలు- రెండు చిన్నగా తరిగినవి,
పసుపు- 1/2 టీ స్పూన్‌,
ఉప్పు- రుచికి సరిపడినంత,
టమాటాలు- 2 చిన్నగా తరిగినవి,
మిర్చి- 1/2 చిన్నగా తరిగినది,
అల్లం వెల్లుల్లి పెస్ట్‌- 1 స్పూన్‌,
కొత్తిమీర, కరివేపాకు-కొద్దిగా తరిగినది.

తయారీ విధానం:

ముందుగా పచ్చి బఠాణీలను రాత్రంతా నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని..తరువాత కుక్కర్‌ లో వేసి ఉడికించుకోవాలి. దానిని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి. ఆ తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

ఆ తరువాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తరువాత ఉడకబెట్టిన బఠాణీలు, టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. తరువాత 1 కప్పు నీరు పోసి బాగా కలపాలి. చివరిలో కొద్దిగా గరం మసాలా వేసి దించుకోవాలి.

చివరన కొత్తిమీర వేసి కూరని పొయి మీద నుంచి దించేయాలి. ఈ కర్రీ రైస్ లోకి అయినా..చపాతీల్లోకి అయినా బాగుంటుంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు