Breaking : ఏపీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ దుర్మరణం.!

ఏపీలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

Breaking : ఏపీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ దుర్మరణం.!
New Update

PDF MLC Shaik Sabji :  ఏపీ(AP) లో విషాదం చోటుచేసుకుంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ కారును మరో కారు ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read: త్వరలో మెగా డీఎస్సీ.. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం: తమిళిసై

ఈ ఘటనలో ఎమ్మెల్సీ సీసీకి.. గన్‌మెన్‌కి కూడా గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం భీమవరం(Bhimavaram) లోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఎమ్మెల్సీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఏలూరులో అంగన్ వాడీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి భీమవారం వెళ్తుండగా .. ఈ కారు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఎమ్మెల్సీ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధూమంతుని గూడెం గ్రామం. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న షేక్‌ సాబ్జి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా శ్రమించారు. ఉపాధ్యుల హక్కుల కోసం ఎంతగానో పోరాడారు. అందుకే ఆయన 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపొందారు. ఆయన మృతితో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

#telugu-news #bhimavaram #pdf-mlc-shaik-sabji
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe