Paytm Shares:పేటీఎం షేర్లు పెరుగుతున్నాయి.. ఈ బూమ్ నిలబడేనా?

ఆర్బీఐ చర్యల తరువాత పేటీఎం షేర్లు భారీస్థాయిలో పడిపోయిన విషయం తెల్సిందే. అయితే, ఇప్పుడు వరుస సెషన్స్ లో పేటీఎం షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకుతున్నాయి. అయితే, ఈ బూమ్ ఎంతకాలం ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు అంటున్నారు. 

New Update
Paytm and Paytm Bank : వేరైన పేటీఎం.. పేటీఎం బ్యాంక్.. షేర్ జంప్.. 

Paytm shares: Paytm షేర్లు ఈరోజు పెరుగుతున్నాయి. వరుస  ట్రేడింగ్ సెషన్స్లో Paytmలో అప్పర్ సర్క్యూట్ లో ఉంటూ వస్తోంది.  Paytm బ్రాండ్‌ను కలిగి ఉన్న One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు సోమవారం ఉదయం నుండి రూ. 17.05 లేదా 5 శాతం పెరుగుదలతో రూ. 358.35 వద్ద ట్రేడవుతూ వచ్చాయి. కంపెనీ షేర్లు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలో వరుసగా ఐదు శాతం లాభంతో రూ.358.55, రూ.358.35 వద్ద ట్రేడయ్యాయి. మంగళవారం కూడా ఉదయం మార్కెట్ ప్రారంభమైన వెంటనే Paytm షేర్లు 5% ఎగువ సర్క్యూట్‌ను తాకాయి.

ఆర్‌బీఐ నిర్ణయం తర్వాత పేటీఎం షేర్లలో (Paytm shares) నిరంతర తగ్గుదల కనిపించింది. ఒకదశలో షేర్ 20 శాతానికి పైగా పడిపోయింది. నిజానికి  ఫిబ్రవరి 29, 2024 తర్వాత ఏ కస్టమర్ కూడా తన ఎకౌంట్, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్, వాలెట్,  ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను అంగీకరించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి 31న Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని ఆదేశించింది. ఈ ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి కంపెనీ షేర్లలో (Paytm shares) భారీ క్షీణత నెలకొంది. స్టాక్‌లలో ఒకదాని తర్వాత ఒకటి లోయర్ సర్క్యూట్ జరుగుతూనే వచ్చింది. అయితే ఇప్పుడు ఆర్బీఐ ఈ ఉత్తర్వులను మార్చి 15 వరకు పొడిగించింది. అంటే, ఇప్పుడు మార్చి 15 తర్వాత డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను స్వీకరించకూడదని ఆదేశాలు ఇచ్చారు.  RBI తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం ఇప్పుడు Paytm షేర్లపై కనిపిస్తోంది. కంపెనీ షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి.

కానీ పేటీఎం విషయంలో ఆర్‌బీఐ నుంచి ఎలాంటి వెసులుబాటు కనిపించడం లేదు. KYC, ఇతర నియమాలతో సహా నిబంధనలను Paytm తరచూ పక్కకు పెడుతూ వస్తోందని సెంట్రల్ బ్యాంక్ చెబుతోంది. RBI బ్యాంకుకు అనేక హెచ్చరికలు జారీ చేసినప్పటికీ Paytm వాటిని కూడా పట్టించుకోలేదని ఆర్బీఐ చెప్పింది. 

Also Read: ఫుల్లుగా మందేసిన చిరుత.. ఆడేసుకున్న జనాలు!

ఇదిలా ఉండగా, ఇప్పుడు పేటీఎం వాలెట్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు కూడా పేటీఎం షేర్ల(Paytm shares) పెరుగుదలకు కారణంగా భావించవచ్చని నిపుణులు అంటున్నారు. పేటీఎం రెండు రోజుల యాక్సిస్ బ్యాంక్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించింది. పేటీఎం మర్చంట్ పేమెంట్స్ కోసం యాక్సిస్ బ్యాంక్ తో కలిసి పనిచేయనున్నట్టు చెప్పింది. ఈ నిర్ణయం సానుకూలంగా మార్కెట్ పై పనిచేస్తోందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా, ఈడీ కూడా పేటీఎం ఫెమా ఉల్లంఘనలకు పాల్పడలేడనై క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో పేటీఎం షేర్లలో అప్పర్ సర్క్యూట్ కనిపిస్తోందని భావిస్తున్నారు. 

ఇది ఎంతకాలం ఇలా కొనసాగుతుందనేది.. ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేదానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అప్పర్ సర్క్యూట్ లో షేర్లు(Paytm shares) ట్రేడ్ అవుతున్నా.. అది కొనసాగుతుందా లేదా అనేది కచ్చితంగా చెప్పలేమని వారు చెబుతున్నారు. మునుపటి స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ.. అది ఎప్పటికి జరుగుతుందనేది ఇప్పుడే చెప్పడానికి అవకాశం లేదని నిపుణులు చెబుతున్న మాట. 

RBI ఎందుకు కఠినంగా వ్యవహరించింది?
Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL)కి అసోసియేట్ కావడం గమనార్హం. Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో One97 కమ్యూనికేషన్స్ 49 శాతం వాటాను (నేరుగా అలాగే దాని అనుబంధ సంస్థ ద్వారా) కలిగి ఉంది. One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) విజయ్ శేఖర్ శర్మ బ్యాంక్‌లో 51 శాతం వాటాను కలిగి ఉన్నారు. పేటీఎం బ్యాంకు ఆర్‌బీఐ నిబంధనలను పట్టించుకోకపోవడంతో ఆర్‌బీఐ ఈ కఠిన నిర్ణయాన్ని వెలువరించింది. 

Watch this Interesting Video :

Advertisment
తాజా కథనాలు