Paytm and Zomato Deal: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఫిన్‌టెక్ సంస్థ Paytm మూవీ టికెటింగ్ సర్వీస్- ఈవెంట్ బిజినెస్‌ను కొనుగోలు చేయబోతోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, రెండు కంపెనీల మధ్య ఒప్పందం చివరి దశలో ఉంది. ఈ డీల్ కోసం జొమాటో పేటీఎంకు రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. Paytmతో ఈ ఒప్పందం ద్వారా, Zomato ఫుడ్, కిరాణా రంగాలతో పాటు.. వినోదం వంటి రంగాలలో కూడా వినియోగదారుల డిమాండ్‌ను తీర్చాలనుకుంటోంది. డీల్ ఖరారైతే, ఇది Zomatoకి రెండవ అతిపెద్ద కొనుగోలు అవుతుంది. అంతకుముందు 2022లో, కంపెనీ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్‌ను రూ.4,447 కోట్లకు కొనుగోలు చేసింది.
Paytm Movie - Paytm ఇన్‌సైడర్ మ్యాటర్‌తో
నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఈ డీల్‌తో, Paytm మూవీ - Paytm ఇన్‌సైడర్‌లు ఒక యూనిట్‌గా విలీనం అవుతాయి. Zomato చాలా కాలంగా ఈ విభాగంలో ఆసక్తిని కలిగి ఉంది, కాబట్టి ఈ ఒప్పందం అర్ధవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఆన్‌లైన్ టికెటింగ్ -ఈవెంట్ ప్లాట్‌ఫారమ్ 2017లో ప్రారంభించారు..
Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఓన్లీ మచ్ లౌడర్ (OML) మద్దతు ఉన్న ఆన్‌లైన్ టికెటింగ్ - ఈవెంట్ ప్లాట్‌ఫారమ్ Insider.inని 2017లో రూ. 35 కోట్లకు కొనుగోలు చేసింది.
Zomato నాల్గవ త్రైమాసికంలో 175 కోట్ల రూపాయల లాభం..
2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 175 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో అంటే Q4FY23లో.. Zomato రూ. 188 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కంపెనీ ఆదాయాలు గ్రీన్ మార్క్‌లో అంటే లాభంలో ఉండడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం.
అయితే, మొత్తం ఆర్థిక సంవత్సరం గురించి చూసినట్లయితే, కంపెనీ 2024లో రూ. 351 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. ఏడాదిలో కంపెనీ రూ.12,114 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. FY 2023లో, Zomato రూ. 971 కోట్ల నష్టాన్ని కలిగి ఉంది. ఆదాయం రూ. 7,079 కోట్లుగా ఉంది.