ప్రస్తుతం అన్ని రాష్ట్రాల మార్కెట్లో టమాటాల ధరలు కొండెక్కాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో టమాటా ధరలు ఒక్కోలా ఉన్నప్పటికీ.. వాటి ధర వింటే మాత్రం గుండె దడ పెరిగిపోతుంది. ప్రస్తుతం కేజీ టమాటాలు రూ.150 నుంచి 200 రూపాయల ధర పలుకుతోంది. అందులోనూ భారీ వర్షాల కారణంగా సరైన దిగుమంతి రాక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్ కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో టమాటాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.
దీంతో సామాన్యులు ట'మాట' ఎత్తితేనే భయపడిపోతున్నారు. టమాటా ధర తగ్గించేందుకు అనే మార్గాలు ఉన్నప్పటికీ, మార్కెట్లో అధిక ధరలకే విక్రయిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరలో సగం ధరకే టమాటాలను కొనే ఛాన్స్ ఉంది. అదేంటని షాక్ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ONDC ఫ్లాట్ ఫామ్, ఫిన్ టెక్ సంస్థ Paytm మధ్యతరగతి, సామాన్యుల కుటుంబాల వారికి ఒత్తిడి తగ్గించేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ యాప్ ద్వారా మీరు టమోటాలను సగం ధరకే కొనొచ్చు. అంతేకాదు మీ ఇంటికి ఉచితంగా డెలివరీని కూడా పొందొచ్చు. ప్రస్తుతం టమాటాలు కిలో రూ.70కే లభిస్తున్నాయి. ఈ సందర్భంగా సగం ధరకే టమాటాను ఎలా పొందాలంటే.. ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో తెలుసుకోండి.
ఈ టమాటాలను నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతానికి ఢిల్లీ-NCR ప్రాంతంలో నివసించే వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. Paytm, ONDC యాప్ నుంచి వీటిని పొందొచ్చు. ONDC ప్రకారం, వినియోగదారులు Paytm నుంచి పూర్తిగా ఉచిత డెలివరీతో పాటు 140 రూపాయలకు గరిష్టంగా రెండు కిలోల వరకు టమోటలను కొనుగోలు చేయొచ్చు.
వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఎన్సీసీఎఫ్ నివేదికల ప్రకారం.. రాబోయే రోజుల్లో టమాటాల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. టమాటాలతో పాటు ఇతర ఆహార పదార్థాలు, కిరాణా సరుకులు, కిచెన్, ఫ్యాషన్ ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులను కూడా ఓఎన్డీసీ ప్లాట్ ఫామ్ లో ఆర్డర్ చేయవచ్చు. ప్రభుత్వ సహాయంతో ఈ సేవ ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ సేవలు ఢిల్లీ-NCR, ముంబై, కోల్ కత్తా, చెన్నై, కాంచీపురం, హైదరాబాద్, బాగల్ కోట్, లక్నోలో అందుబాటులో ఉన్నాయి. Paytmలో సెర్చ్ చేయడం ద్వారా మీరు ఈ అవకాశాన్ని పొందొచ్చు.