Posani vs Pawan: 'పార్టీని కబ్జా చేయడానికి అమ్మాయిలను పంపించారు'.. నీకు తెలియదా? పవన్‌ టార్గెట్‌గా పోసాని ఫైర్!

సంఘ విద్రోహ శక్తులకు డేటా ఇస్తున్నారంటూ వాలంటీర్లపై ఏలూరు బహిరంగ సభలో ఆరోపణలు చేసిన పవన్‌పై ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ ఫైర్ అయ్యారు. సినీ ఇండ్రస్టీలోని ఆడవాళ్లను తిట్టిన వాళ్లపై పవన్‌ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.

New Update
Posani vs Pawan: 'పార్టీని కబ్జా చేయడానికి అమ్మాయిలను పంపించారు'.. నీకు తెలియదా? పవన్‌ టార్గెట్‌గా పోసాని ఫైర్!

ఏలూగు బహిరంగ సభలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా పవన్‌పై విరుచుకుపడుతుండగా..తాజాగా ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ వారితో గొంతు కలిపారు. పవన్ కల్యాణ్‌కు అసలు హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు.

నారాలోకేశ్‌ ఫోటోలతో ప్రశ్నల వర్షం:
రాష్ట్రంలోని వాలంటీర్లు డేటా చోరీ చేస్తూ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, అందులో పెళ్లి అవ్వని వాళ్ల సంఖ్య ఎంత.. వితంతువుల ఎంతమంది ఉన్నారు లాంటి సమాచారాన్ని సేకరిస్తూ వాటిని సంఘవిద్రోహ శక్తులకు ఇస్తున్నారని పవన్‌ ఆరోపించారు. మానవ ఆక్రహ రవాణ పెరగడానికి వాలంటీర్లే కారణమన్నారు. ఇదే విషయంపై పోసాని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. టీడీపీ యువనేత, చంద్రబాబు తనయుడు నారాలోకేశ్‌ అమెరికాలో అమ్మాయిలతో ఉన్న ఫోటోలనూ చూపిస్తూ పవన్‌ని నిలదీశారు. ఓ అమ్మాయి నడుం కొలతను లోకేశ్‌ టేప్‌తో చూస్తున్న ఫోటోను హైలెట్ చేస్తూ 'దీనికి ఏం సమాధానం చెబుతావ్‌' పవన్‌ అంటూ ప్రశ్నించారు.

పవన్‌ షేమ్‌ అన్‌ యూ:
వాలంటీర్లపై పవన్‌ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలుంటే చూపెట్టాలన్నారు పోసాని. మహిళా వాలంటీర్లపై ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని.. ఒక్కరైనా అలా చేసి ఉంటే ఫ్రూఫ్‌ చూపించాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఓ పార్టీని కబ్జా చేయడానికి..పార్టీని లాగేసుకోవడానికి అమ్మాయిలను పంపించిన వాళ్ల గురించి పవన్‌ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పార్టీని లాగేసుకున్నది ఎవరో అందరికి తెలుసంటూ ఫైర్ అయ్యారు. నీ రాజకీయ గురువు కాబట్టే చంద్రబాబు గురించి కానీ..అతని కొడుకు లోకేశ్‌ గురించి కానీ మాట్లాడడంలేదంటూ మండిపడ్డారు పోసాని. కేవలం జగన్‌కి రాజకీయ భవిష్యత్‌ ఉండకూడదనే చూస్తున్నావ్‌ అని.. సీఎం ఏం తప్పు చేశారో చెప్పాలని నిలదీశారు పోసాని.

చిరంజీవి బాధ పడ్డారు:
సినీ ఇండ్రస్టీలోని ఆడవాళ్లను తిట్టిన వాళ్లపై పవన్‌ ఎందుకు స్పందించరని ప్రశ్నించిన పోసాని.. భీమవరంలో టీడీపీ వల్లే పవన్‌ ఓడిపోయారన్న విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. అటు చిరంజీవి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పోసాని. ‘మీ అన్నయ్య చిరంజీవి ఇంట్లో ఆడవాళ్లను తిట్టించారు.. చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏంటి మురళీ ఇది.. రాజకీయాల్లోకి వస్తే, వాళ్ల మాట వినకుంటే ఇంట్లో ఆడవాళ్లను తిట్టిస్తారా? నన్ను టార్గెట్ చేస్తే భరిస్తా.. ఆడవాళ్లు వాళ్లెలా భరిస్తారయ్యా అంటూ చిరంజీవి వాపోయారు. అప్పుడు నువ్వు స్పందించలేదు. అదేమని అడిగిన నన్ను, నా కుటుంబంలోని ఆడవాళ్లపై దాడి చేశారు. అప్పుడూ నువ్వు స్పందించలేదు. పవన్ కల్యాణ్ ఎటు పోతున్నావు..? ఎలాంటి వారికి మద్దతిస్తున్నావో నీకైనా తెలుస్తుందా?’ అంటూ పోసాని మండిపడ్డారు. ఇక తన కుటుంబం గురించి ఎవరైనా ఓ మాట అంటే పవన్‌ బాధ పడిపోతుంటారని.. కానీ నువ్వు అన్న మాటలకు వాలంటీర్ల తల్లులు ఎలా బాధపడతారో ఆలోచించావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు