/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pawan-6-jpg.webp)
ఉత్తరాంధ్రాలో దొపిడి ఆగాలంటూ ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖలో దాదాపు 1,200 ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఉండేవని.. ప్రస్తుతం 292 ఎకరాలకు చేరినట్టు ఆరోపించారు పవన్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 292 ఎకరాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయన్నారు. వైసీపీ నేతలకు చిన్నపాటి కనికరం లేదని విమర్శించారు. 20 వేల సంవత్సరాలు ఎర్రమట్టి దిబ్బలు సహజసిద్దంగా ఏర్పాడ్డాయన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు,ఎర్రమట్టిదిబ్బల్లో నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటు ఆస్తులకు,ప్రభుత్వంకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇందులో కలెక్టర్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఎర్రమట్టి దిబ్బలపై పర్యావరణ ప్రేమికులు దృష్టిపెట్టాలని చెప్పారు. ఎర్రమట్టిదిబ్బల్లో పవన్ కల్యాణ్ ఈ కామెంట్స్ చేశారు.
పవన్ ఏమన్నారంటే?
• ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద.
• దిబ్బల రక్షణపై పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తాం.
• ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి.
• వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తాం.
• టూరిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు
• ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు ఆస్తుల్లా భావిస్తున్నారు.
• 32 భారత వారసత్వ ప్రదేశాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఒకటి
• చుట్టూ రియల్ ఎస్టేట్ వల్ల ఎర్రమట్టి దిబ్బలు కుంగిపోతున్నాయి.
• 1200 ఎకరాలను మొదట నేవీకి ఇస్తే చివరకు 292 ఎకరాలు మిగిలింది.
• వేల సంవత్సరాలుగా ఎర్రమట్టిదిబ్బలు సహజసిద్దంగా ఏర్పాడ్డాయి.
• ఎర్రమట్టి దిబ్బల సమీపంలో మట్టి తవ్వడానికి వీఎంఆర్డీఏకు ఏం అవసరం?
• ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం, దోపిడీ ఆగాలి
• వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణాలు చేస్తున్నారు
• వైసీపీకి మట్టి డబ్బుల్లా కనిపిస్తుంది
• తెలిసో, తెలియకో కొంత ప్రాంతం రక్షణ శాఖకు ఇచ్చారు.
• మిగిలిన ప్రాంతాన్ని కూడా దోచేస్తున్నారు.
Follow Us