/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pawan-4-1.jpg)
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా పని మొదలుపెట్టారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న, ఇవాళ అధికారులతో భేటీ అయ్యారు. తొలుత పంచాయతీరాజ్ శాఖపై పవన్ ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ఆరా తీస్తున్నారు. వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని చేసిన సంగతి తెలిసిందే. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో సమీక్ష నిర్వహించారు.