/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pawan-1-1-jpg.webp)
Pawan Kalyan silence: ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్న చంద్రబాబుకు ఐటి నోటీసులు అంశం..చివరకు పవన్ కళ్యాణ్ కు ఇబ్బందులు తెచ్చే పెట్టేట్లు కనబడుతుంది అనే చర్చ నడుస్తుంది.. చంద్రబాబుకు ఇచ్చిన ఐటి నోటీసులు పై చంద్రబాబు, ఆ పార్టీ నేతలు స్పందించి దానిపైన క్లారిటీ కూడా ఇచ్చారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నోరు మెదపాలని నిన్న, మొన్నటి వరకు డిమాండ్ చేసిన వైసీపీ..ఐటి నోటీసుల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదంటూ ..పవన్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సందిస్తుంది..టీడీపీని వదిలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడి దిగుతుంది..చంద్రబాబుకి ఐటీ నోటీసుల వ్యవహారంలో ఆ పార్టీ సైలెంట్ గా ఉండడం సహజంగా జరిగేది..కానీ, చంద్రబాబుకు నోటీసుల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు..ఇదే ఇప్పుడు అధికార పార్టీ నేతలు వేస్తున్న ప్రశ్న. అధికార పార్టీ నేతలే కాదు ఆయన అభిమానిస్తున్న జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం ఏంటి అంటూ మాట్లాడుకుంటున్నారు..చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు ప్యాకేజి ఇస్తేనే పాలిటిక్స్ చేస్తాడంటూ వైసీపీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వారి పై కౌంటర్ ఇచ్చారు, విరుచుకు పడ్డారు.ఐటీ నోటీసుల వ్యవహారంలో స్పందించకపోవడానికి కారణం ఏంటని చర్చ ఆ పార్టీలో కూడా నడుస్తుంది.పొత్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే చంద్రబాబుని పై ఎలాంటి విమర్శలు చేయకపోవడం...కళ్యాణ్ కి రాజకీయంగా ఇబ్బంది ఎదుర్కునే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తుంది..
పవన్ మౌనం..రాజకీయ వ్యూహమా?
అయితే పవన్ కళ్యాణ్ మౌనం వెనుక ఏదయినా రాజకీయ వ్యూహం ఉందా లేక టీడీపీని విమర్శించడం ద్వారా ,లేదా ఐటీ నోటీసులపై స్పందించడం ద్వారా వైసీపీ ట్రాప్ లో పడినట్టు అవుతుందనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు సమాచారం.ఐటీ నోటీసులు అనేవి కేంద్ర పరిధిలోనివి కాబట్టి స్పందించకపోవడమే బెటర్ అనే భావంలో పవన్ కళ్యాణ్ ఉన్నారని టాక్ నడుస్తుంది.నోటీసులపై స్పందిస్తే ఒక రకమైన ఇబ్బంది ,స్పందించకుంటే మరో రకమైన ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని భావనలో ఆ పార్టీ ఉందనే ప్రచారం నడుస్తుంది..
రాజకీయ ఇబ్బంది ఎందుకనా.?
పవన్ కళ్యాణ్ కి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉండడంతో బీజేపీతో కలిసే కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు.బీజేపీ పొత్తులో ఇంకా ఉన్నామని పదే పదే చెబుతున్న జనసేన పార్టీ నేతలు ..చంద్రబాబు కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై వ్యతిరేకంగా స్పందిస్తే.. ఇన్ డైరెక్ట్ గా బీజేపీపై విమర్శలు చేసినట్లు ఉంటుందని,అలా చేయడం ద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భావనలో పవన్ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఐటీ నోటీసులపై సానుకూలంగా స్పందిస్తే.. చంద్రబాబుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు మద్దతిచ్చినట్లేనని ఆ పార్టీ నేతలు అనుకూనే ఛాన్స్ ఉంది . ఇందులో భాగంగానే పవన్ మౌనంగా ఉంటున్నారనే టాక్ నడుస్తుంది.. ఇలా ఎటువైపు స్పందించినా..రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని.. అందుకే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారనే టాక్ నడుస్తుంది.
జనసేన స్ట్రాటజీ ఏంటి..?
ఇక మరోవైపు జనసేన లో ఉన్న టీడీపీ యాంటీ వర్గం నేతలైతే..పవన్ కళ్యాణ్ కచ్చితంగా స్పందించాలని మాట్లాడుకుంటున్నారు. జనసేన పార్టీ ఒంటరిగా ఎదగాలన్న, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్నా..కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదని..ఇలాంటి సందర్భంలో న్యూట్రల్ గా ఉండి.. తాము ఎవరికి మద్దతు కాదనే స్ట్రాటజీ తీసుకోవాలని జనసేనలోని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ బీ పార్టీ అనే ముద్ర వేసుకున్నమని..చంద్రబాబు ఏది చెప్తే అది చేస్తామని ప్రచారమున్న నేపథ్యంలో..ఆ ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకైనా పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరుతున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ స్పందించకపోతే న్యూట్రల్ ఓటర్లుగా ఉన్నటువంటి ఆయన అభిమానులు, జనసేన ను అభిమానించే న్యూట్రల్ ఓటర్లు జనసేన పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జనసేనకు వైసీపీ ఎంతో..టీడీపీ కూడా అంతేననే భావన తీసుకు రాగలిగితే ..పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. పొత్తులు పెట్టుకోక ముందే చంద్రబాబు మీద ఈగ వాలనివ్వకుండా పవన్ సపోర్ట్ చేస్తారనే ముద్రను చెరిపేసుకోవాలని సూచన చేస్తున్నారు ఆ పార్టీలోని కొంతమంది నేతలు.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మౌనం మాత్రం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది..మరి పవన్ కళ్యాణ్ దీనిపైన రియాక్ట్ అవుతారో వేచి చూడాలి..