స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన.. జేఏసీ సమావేశానికి డేట్ ఫిక్స్!

టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది . ఈ నెల 23న రాజమండ్రిలో తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జేఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల దిశగా ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదర్చడం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకొనున్నారు.

New Update
స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన.. జేఏసీ సమావేశానికి డేట్ ఫిక్స్!

JAC: ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా, పొత్తు కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ-జనసేన(TDP-JSP) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ(JAC)  తేదీ ఖరారైంది. ఈ నెల 23న రాజమండ్రిలో  తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం కానుంది. పవన్ కల్యాణ్(pawan kalyan) అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం కానుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ,  ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది.

ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కాగా, జైల్లో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చిన వెంటనే.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, పొత్తు దిశగా టీడీపీ ముందడుగు వేసింది. జనసేనతో సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 23న రాజమండ్రిలో సమావేశం కానున్నారు.

Also Read: బిల్డప్ వద్దు..టోఫెల్ లో 4500 కోట్ల స్కాం నిరూపించండి..!!

లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన టీడీపీ-జనసేన జేఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల దిశగా ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదర్చడం తదితర అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ కార్యక్రమాల జోరు పెంచేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేయడంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, పొత్తు సమన్వయం కోసం టీడీపీ, జనసేన ఇప్పటికే జేఏసీ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు