Allu Arjun: నంద్యాలలో కనిపించని అల్లు అర్జున్ క్రేజ్..!

నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఓటమి దిశగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. పిఠాపురంలో మామ పవన్‌ కల్యాణ్‌ కోసం ప్రచారం చేయకుండా వైసీపీ అభ్యర్థి శిల్పారవికి అల్లు అర్జున్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

New Update
Allu Arjun: నంద్యాలలో కనిపించని అల్లు అర్జున్ క్రేజ్..!

Allu Arjun: నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పారవికి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. పిఠాపురంలో మామ పవన్‌ కల్యాణ్‌ కోసం ప్రచారం చేయకుండా.. వైసీపీ అభ్యర్థి శిల్పారవికి ప్రచారం చేశారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఆయనపై మెగా ఫ్యామిలీ నుంచి తీవ్ర విమర్శలు వినిపించాయి. కాగా, అల్లు అర్జున్ కు సినిమాలో ఎంత క్రేజ్ ఉన్నా ఎన్నికల్లో మాత్రం ఆయన ప్రభావం కనిపించలేదు.

Also Read:  ఏపీ ఫలితాలపై రోజా ట్వీట్.. ఏమన్నారంటే?

ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఓటమి దిశగా కొనసాగుతున్నారు.  నంద్యాలలో 17 రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయింది. అయితే, టీడీపీ అభ్యర్థి ఫరూక్‌ 13,825 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. దీంతో శిల్పా రవి  కౌంటింగ్‌ కేంద్రం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. శిల్పా రవి ఓటమి నేపధ్యంలో అల్లు అర్జున్‌ ఇమేజ్ డ్యామేజ్‌ అయింది.

Advertisment
తాజా కథనాలు