Pawan AI Video: పవన్ చూపెట్టింది AI వీడియోనా?.. నెట్టింట ట్రోల్స్!

తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన డ్రోన్ల ద్వారా ఓ మహిళ సాయాన్ని అందుకుంటున్న ఫొటోను చూపించారు. అయితే ఆ ఫొటో ఏఐ అని, దాని మీద లోగో కూడా ఉందని నెట్టింట ట్రోల్స్‌ మొదలయ్యాయి.

Pawan AI Video: పవన్ చూపెట్టింది AI వీడియోనా?.. నెట్టింట ట్రోల్స్!
New Update

Pawan AI Video: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం మిగిల్చిన బాధలు అన్ని ఇన్ని కాదు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్ష కూడా నిర్వహించారు. ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ ప్రదర్శించిన ఫొటో పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నడుము లోతు నీళ్లల్లో ఉన్న ఓ మహిళకు డ్రోన్‌ ద్వారా సాయం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఆయన చూపించారు.

డ్రోన్ల పనితీరుకు ఇది నిదర్శనమని ఆయనపేర్కొన్నారు. ఈ ఫొటోకు అంతర్జాతీయ అవార్డు కూడా వస్తుందని అన్నారు. అయితే ఈ వీడియోను నెటిజన్లు షేర్‌ చేస్తూ ఇందులోని ఫొటో ఏఐ అని, లోగో కూడా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరి దీని గురించి పవన్‌ , జనసేన వారు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

Also Read: టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి