వైసీపీ పాలనలో వృక్షాలు విలపిస్తున్నాయని పవన్ సెటైర్లు వారాహియాత్ర సక్సెస్ తర్వాత ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా కౌంటర్లు మీద కౌంటర్లు వేస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ, విద్యా వ్యవస్థపై ట్వీట్స్ చేసిన పవన్.. తాజాగా సీఎం జగన్ పర్యటనల సందర్భంగా చెట్ల నరికివేతపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. By BalaMurali Krishna 24 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి చెట్ల నరికివేతపై పవన్ సెటైర్లు.. వైసీపీ ప్రభుత్వ తీరుపై మరోసారి ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. కొంతకాలంగా సీఎం జగన్ రాష్ట్ర పర్యటనల సందర్భంగా స్థానికంగా ఉన్న చెట్లను నరికివేస్తున్న ఘటనలను ప్రస్తావించారు. ఈనెల 26న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో జగన్ పర్యటించనున్నారు. సీఎం హెలికాఫ్టర్ దిగేందుకు అధికారులు ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ వద్ద ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్లను నరికి హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. దీనిపై పవన్ స్పందిస్తూ వైసీపీ పాలనలో చెట్లు కూడా విలపిస్తున్నాయని సెటైర్లు వేశారు. వృక్షో రక్షతి రక్షితః.. ‘కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి. వృక్షో రక్షతి రక్షితః అని ట్వీట్ చేశారు’ ట్వీట్ చేశారు. ‘జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ‘పుష్ప విలాపం’చదవనప్పుడు, జగదీష్ చంద్రబోస్ ప్రయోగాలు మీకు అర్థం కానప్పుడు, మొక్కలు,చెట్లకు గాయం చేస్తే ఎలా ఉంటుందో వీటిని చూస్తే తెలుస్తుంది. సీఎం పట్టించుకోకపోయినా కనీసం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఇలా విచక్షణారహితంగా చెట్లను నరకవద్దని సంబంధిత అధికారులకు సూచించాలి’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జంధ్యాల పాపయ్య శాస్త్రి ‘పుష్ప విలాపం’నుంచి ఒక సారాంశం కూడా ప్రస్తావించారు. పుష్పవిలాపం సారాంశం.. ''ఓయీ మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి అందమును హత్య చేసెడి హంతకుండా మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ.. అని దూషించు పూలకన్నియల కోయలేక వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు.. ప్రభూ...'' అనే పద్యాన్ని పోస్ట్ చేశారు. గతంలోనూ వాలంటీర్లు, విద్యావ్యవస్థలపైనా పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ప్రభుత్వ తీరును ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మొత్తానికి వారాహియాత్ర తర్వాత సీఎం జగన్ పాలనతో పాటు ప్రభుత్వ విధానాలను జనసేనాని తీవ్రంగా ఎండగడుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి