/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/75.jpg)
Pawan Kalyan Swaring In: ఏపీ అసెంబ్లీ ఎన్నికల క్రతువులో చిట్టచివరి అతి పెద్ద ఘట్టం ముగిసింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 12 ఎకరాలసు విశాల ప్రాంగణంలో.. పూల పల్లకి లాంటి వేదికపై.. దేశ ప్రధాని మోదీతో పాటు రాజకీయ అతిరథ మహారధులు.. సెలబ్రిటీలు, ప్రముఖుల మధ్య లక్షలాది మంది ప్రజల జయజయ ధ్వానాల మధ్య చంద్రబాబు నాయిడు అనే నేను అంటూ నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు ప్రమాణ అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న సందర్భంలో.. పవన్ అనే నేను అని పవన్ చెప్పగానే సభా ప్రాంగణం మొత్తం పవన్ కళ్యాణ్ పేరుతొ మారు మోగింది.
గూస్బంప్స్ తెప్పిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం.. @PawanKalyan#PawanKalyanAneNenu#DeputyCM#RTVpic.twitter.com/SuJIp0xeUi
— RTV (@RTVnewsnetwork) June 12, 2024