పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ… బ్రో. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన మోషన్ పోస్టర్ పై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టరే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ లెవల్లో ఉంటుందన్న ఊహే పవన్ అభిమానుల్లో పూనకాలను నింపుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో కీలక అప్ డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని తెలుస్తోంది. పాట, ఫైట్ తో సహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందట. ఇందుకు సంబంధించిన ఓ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్, సాయి ధరమ్ తేజ కలిసి నటిస్తుండంటతో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్ లతో సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తుంది. తాజాగా పవన్ కు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని తెలుస్తోంది. సాంగ్, ఫైట్ తో సహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందట.ఇక డబ్బింగ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉందని టాక్ వినిపిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతంకు తెలుగు రీమేక్ గా ఈసినిమా రూపొందుతోంది. ఇక ఈసినిమాను జూలై 28,2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా మొత్తం పవన్ సరికొత్త లుక్ లో దర్శనమివ్వబోతున్నాడు.
ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన సముద్రఖని రీమేక్ వెర్షన్ కూడా తెరకెక్కిస్తున్నాడు. ఒక యాక్సిడెంట్ లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు.
ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తుంది.