తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావాలి: కేసీఆర్ పేరెత్తకుండా సాగిన పవన్ ప్రసంగం

ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీకి తన మద్దతు ప్రకటించారు. అయితే.. కేసీఆర్ పేరెత్తకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు లేకుండానే పవన్ ప్రసంగం సాగింది.

తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావాలి: కేసీఆర్ పేరెత్తకుండా సాగిన పవన్ ప్రసంగం
New Update

తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. బీజేపీకి (BJP) తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణను సాధించుకున్నామన్నారు. అయితే.. రాష్ట్రం వచ్చింది కానీ..  ఆ నినాదాలు నిజమయ్యాయా? అన్న ప్రశ్న ఇంకా మిగిలే ఉందన్నారు. ఐదేళ్ల పాటు ఎన్నికలే ధ్యేయంగా ప్రభుత్వాలు పని చేయవద్దన్నారు. ఎన్నికలే ధ్యేయంగా ప్రధాని మోదీ పనిచేస్తే.. 317 ఆర్టికల్ రద్దు, మహిళా బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు, అయోధ్య రామ మందిర నిర్మాణం, నోట్ల రద్దు సాధ్యం అయ్యేయా? అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: TS Elections: సొంతిల్లు కూడా లేని బండి సంజయ్.. ఆ మంత్రికి 58శాతం పెరిగిన ఆస్తులు..!

మోదీకి దేశ ప్రయోజనాలే తప్పా.. ఎన్నికల ప్రయోజనాలు ఉండవన్నారు. మన దేశంపై దాడి చేస్తే తిరిగి దాడి చేయగలమని మోదీ నిరూపించారన్నారు. అందుకే తనకు మోదీ అంటే అభిమానం అని వివరించారు పవన్. దేశానికి బలమైన నాయకుడు అవసరమని నాలాగే ప్రతి ఒక్కరూ అనుకున్నారని.. అందుకే మోదీ వచ్చారన్నారు. వారిని ముఖ్యమంత్రి చేస్తాం.. వీరిని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ నోటితో ప్రేమించలేదన్నారు.

బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించి తన చిత్తశుద్ధిని బీజేపీ చాటిందన్నారు పవన్. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన బీజేపీకి తన పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్.. కోసం మనస్ఫూర్తిగా, శాయశక్తులా కష్టపడుతానన్నారు. కలిసి పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు.

#pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe