చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం..పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

జైల్లో చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

New Update
Pawan Kalyan : 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

జైల్లో చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Pawan Kalyan) స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యం (Chandrababu Health) విషయంలో వైసీపీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆయన ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. చంద్రబాబు వయస్సును దృష్టిలో ఉంచుకుని.. ఆయన ఆరోగ్య స్థితిగతులపై మానవతా దృక్పథంలో వ్యవహరించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Chandrababu Case: చంద్రబాబుకు జైలులో ఏసీ.. ఏసీబీ జడ్జి సంచలన ఆదేశాలు

ఈ విషయంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి అవలంభించడం సరికాదన్నారు జనసేనాని. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేస్తే.. ప్రభుత్వ సలహాదారులు, అధికారులు చేసిన వాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రకటన విడుదల చేశారు.

వైద్యుల నివేదికను ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలో న్యాయస్థానం జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని పవన్ కల్యాణ్‌ తన లేఖలో కోరారు. చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు