/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/p-1-jpg.webp)
Rajahmundry: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజమండ్రికి చేరుకున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును వీరు ములాఖత్ ద్వారా కలవనున్నారు. వీరితో పాటు నారా లోకేశ్ కూడా జైలుకు వెళ్లనున్నారు.. సమావేశం సందర్భంగా చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక విషయాలను చర్చించే అవకాశం ఉంది.
చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత జైలు పాలు కావడంతో.. ఆ పార్టీ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క అధికార పార్టీ మాత్రం.. ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. మరోసారి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌ను చూపించి.. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయనను జైలుకు తరలించారు.
మరోవైపు ఈరోజు చంద్రబాబును ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర హడావుడి నెలకొననుంది. బాబు కలవడానికి బాలకష్ణ, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు రాబోతున్నారు. మొట్టమొదటిసారిగా బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఒకేసారి కలిసి కనిపించనున్నారు. పొలిటికల్ గా ఇదొక పెద్ద విషయమనే చెప్పాలి. ఇక బాలకృష్ణ ఆయన అల్లుడు లోకేష్ వారి క్యాంపు నుంచి అదే సమయానికి వస్తారని సమాచారం. బాబుతో ములాఖత్ అయిన తర్వాత ఇద్దరు నేతలు మీడియా మాట్లాడతారని చెబుతున్నారు.
బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వస్తుండడంతో అక్కడ భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తును పెట్టారు. ప్రభుత్వాసుపత్రి, ఆర్ట్స్ కాలేజి దగ్గర బిరకేడ్లు, దారి మళ్ళింపులు పెట్టారు. బాబును కలిశాక జనసేనాని మధ్యాహ్నం రెండుగంటలకు మళ్ళీ ఎయిర్ పోర్ట్ కే వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ వెళిపోతారని సమాచారం.