/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/p-2-jpg.webp)
Pawan Kalyan: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ- జనసేన పొత్తుల ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశంకు ప్రాధాన్యత సంతరించుకుంది. 12:30 గం.లకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు వెళ్లనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి పార్టి కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనున్నారు .
టీడీపీ జనసేన పార్టీ పొత్తు ఉంటుందని రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద పవన్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ప్రకటన తర్వాత మొదటిసారి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఎక్కడెక్కడ పోటీ చేయాలో అంచనాకొచ్చే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలలో బలమైన నియోజకవర్గం ఎంపిక చేయనున్నారని సమాచారం. కాగా, కాపు సామాజిక ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంపై జనసేన అధినేత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమంలో అధినాయకుడుతో తమ అభిప్రాయాలు చెప్పనున్నారు జనసేన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు. చంద్రబాబుతో పవన్ తో లో మాట్లాడిన అంశాలు వివరించనున్నారని సమాచారం. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజక వర్గాల ఇంచార్జులు, వీర మహిళ సమన్వయకర్తలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, సంయుక్త కార్యదర్శులు సమావేశానికి హాజరుకానున్నారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మూడేళ్లుగా పొత్తు ప్రతిపాదనల్లో ఉన్న టీడీపీ, జనసేన ఓ క్లారిటీకి వచ్చేశాయి. ఆరు నూరైనా.. నూరు ఆరైనా కలిసేవుంటామని తేల్చిచెప్పేశాయి. అంతేకాదు ఉమ్మడి కార్యాచరణతో ప్రభుత్వంపై పోరాడనున్నాయి. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. ఏకపక్షంగా టీడీపీతో కలిసినడుస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత తీవ్రంగా స్పందించిన పవన్.. అంతే స్పీడ్‌గా పొత్తుపైనా నిర్ణయం తీసేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌డీఏకి ఏకైక భాగస్వామిగా ఉన్న జనసేన.. ఆ స్నేహాన్ని పక్కన పెడుతుందా? లేక టీడీపీని ఎన్‌డీఏ భాగస్వామి చేసేలా అడుగులు వేస్తుందా? జనసేనాని పవన్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి? టీడీపీ, జనసేన మధ్య ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండబోతోంది..? అన్నదే తేలాల్సివుంది.