BRO Trailer: ఫ్యాన్స్‌కు పూనకాలే..ట్రైలర్‌లో మామాఅల్లుళ్లు అదరగొట్టేశారుగా..

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడూ ఎదురుచూస్తున్న 'బ్రో' ట్రైలర్ వచ్చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. తొలిసారి మామాఅల్లుళ్లు నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్‌కు పునకాలు తెప్పిస్తోంది. ట్రైలర్‌లో పవన్, తేజు కెమిస్ట్రీ అదరగొట్టింది. దీంతో థియేటర్లలో సినిమా చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు.

New Update
BRO Trailer: ఫ్యాన్స్‌కు పూనకాలే..ట్రైలర్‌లో మామాఅల్లుళ్లు అదరగొట్టేశారుగా..

BRO Trailer

మెగా హీరోలు కలిసి నటించిన 'బ్రో' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారిగా మామాఅల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటించడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ సినిమా వినోదయ సితం సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌లోని పవర్ స్టార్ లుక్స్ మూవీపై హైప్స్ క్రియేట్ చేసింది.

అభిమానుల సమక్షంలో ట్రైలర్ రిలీజ్.. 

తాజాగా అభిమానుల సమక్షంలో  ఈ చిత్రం నుంచి ట్రైలర్(BRO Trailer) రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ రాబడుతోంది. ప్రధానమైన పాత్రలు చూపిస్తూ ఈ ట్రైలర్ కట్ చేశారు. తనకి టైమ్ లేదు అంటూ హడావిడి చేసే తేజు పాత్ర హఠాత్తుగా చనిపోవడం.. ఆ తర్వాత అతడితో నడిపించే దైవశక్తిగా పవన్ ఎంట్రీ ఇవ్వడం ట్రైలర్‌లో హైలెట్‌గా ఉంది. ఇక హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇందులో కీలకమైన పాత్రను పోషించడం విశేషం. మీ మనుషుల అందరూ భస్మాసురుడి వారసులు అంటూ పవన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక చివర్లో పవన్ తన పాత పాటలకు డ్యాన్స్ వేయడం ఆకట్టుకుంటుంది.

జులై 28న థియేటర్లలోకి.. 

సోషియో ఫాంటసీ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జులై 28న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఇక థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు ఎలాంటి పునకాలే తప్పిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్లో నటిస్తున్నాడు.

Advertisment
తాజా కథనాలు