Pavala Shyamala : పావలా శ్యామల ఎమోషనల్ వీడియో..!

సోషల్ మీడియాలో సీనియర్ నటి పావలా శ్యామల వీడియో ఒకటి వైరల్ గా మారింది. హీరోలందరితో ఎన్నో హిట్ సినిమాల్లో నటించినా ఆర్థికంగా స్థిరపడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వీల్ చైర్ కు పరిమితమై, అనాథగా బతుకీడుస్తున్నట్లు కంటతడి పెట్టింది.

New Update
Pavala Shyamala : పావలా శ్యామల ఎమోషనల్ వీడియో..!

Pavala Shyamala:  టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలతో నటించిన ఈమె ప్రేక్షకులను ఎంతగానో అలరించేది. అయితే, ప్రస్తుతం ఆమె దీన పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పావలా శ్యామల రిసెంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆమె పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

publive-image

Also Read: రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ముకుంద .. కృష్ణ పై కోపంతో రగిలిపోతున్న ఆదర్శ్

పావలా శ్యామల ఏమందంటే.. అగ్ర హీరోలందరితో కలిసి నటించానని.. సూపర్ హిట్ సినిమాల్లో మంచి పాత్రలు పోషించినా.. ఆర్థికంగా స్థిరపడలేకపోయానని వాపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ గౌరవమర్యాదలు అందుకున్న తనకు ఇప్పుడీ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. ఓ రియాలిటీ షోకు వచ్చిన శ్యామల.. అక్కడి ప్రేక్షకులతో మాట్లాడుతూ తన పరిస్థితిని వివరించారు. ఈ వయసులో అనాథగా, వీల్ చైర్ కు పరిమితమై బతుకీడుస్తున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.

అయితే, తన కష్టాలను చెప్పి మిమ్మల్ని బాధపెట్టాలని ఈ షోకు రాలేదని..మళ్లీ ప్రేక్షకులను చూస్తానో లేదోనని, ఒకసారి అందరికీ కనిపించాలనే ఉద్దేశంతోనే వచ్చానని కామెంట్స్ చేశారు. మరోసారి మీ అభిమానం పొందాలనే ఇప్పుడిలా మీ ముందుకు ఇలా వచ్చానని తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో పావలా శ్యామల దీనస్థితి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో కనిపిస్తూనే ఉంటుంది.

publive-image

కొంతకాలం క్రితం నటుడు కాదంబరి కిరణ్ 'మనం సైతం' ఫౌండేషన్ తరఫున శ్యామలకు రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా టాలీవుడ్  మెగస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సహా పలువురు అగ్ర హీరోలు కూడా గతంలో పావలా శ్యామలను ఆర్థికంగా ఆదుకున్నారు.

Advertisment
తాజా కథనాలు